యుద్ధం మొదలు అయ్యిందంటూ శిరీష ప్రచారం

Barrelakka Nomination As MP Candidate, Barrelakka Nomination, Barrelakka As MP Candidate, MP Candidate, Barrelakka, MP Candidate, Shirisha Nomination as MP Candidate, Shirisha Campaign, Nagar Kurnool, Barrelakka News, Barrelakka Political News, Lok Sabha Elections, TS Political News, TS Live Updates, Telangana, Political News, Mango News, Mango News Telugu
Barrelakka, MP candidate,Shirisha nomination as MP candidate,Shirisha campaign,Nagar Kurnool

ఎంపీగా పోటీ చేస్తానంటూ ఆమధ్య చెప్పిన బర్రెలక్క..ఇప్పుడు ఎంపీగా నామినేషన్ వేసి మరోసారి వార్తలలోకి ఎక్కింది. నిజానికి సోషల్ మీడియా స్టార్ కాస్త పొలిటికల్ స్టార్‌గా ఎప్పుడో మారిపోయింది శిరీష అలియాస్ బర్రెలక్క. ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శిరీష కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అవమానాలు, దాడులు కూడా ఎదుర్కొని నిలబడి.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బలమైన పోటీ ఇచ్చింది. ఉద్దండ రాజకీయ పండితులు కూడా శిరీష్ తెగువ చూసి ఆశ్చర్యపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శిరీషకు 5,754 ఓట్లు పోలయ్యాయి. అయితే అక్కడ ఓడిపోయినా ఆగిపోనంటూ..పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని అప్పుడే చెప్పింది. తర్వాత మార్చి నెలలో వెంకటేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో బర్రెలక్క రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడినట్లే అనుకున్నారు అంతా.

పార్లమెంటు ఎన్నికల నగారా మోగిన తర్వాత కూడా ఎలాంటి పొలిటికల్ ప్రకటన లేకపోవడంతో శిరీష ఇకపై రాజకీయాలకు దూరం అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా తాను ఎంపీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది.నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతానంటూ..మంగళవారం కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేసింది. తనను అందరూ ఆశీర్వదించాలని.. పెద్ద మనసుతో దీవించి, ఆశీర్వదించండి అంటూ వీడియో పోస్టు చేసింది.

ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టేసిన శిరీష.. ఆ వీడియోను కూడా నెట్టింట్లో పోస్టు చేసింది . ఎంపీకి యుద్ధం మొదలు అయ్యిందంటూ ప్రచారంలో పాల్గొన్న వీడియో..ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అలాగే తనలా కొత్తగా నామినేషన్ దాఖలు చేయాలనుకనే వారికి నామినేషన్ పత్రాలు ఎక్కడ దొరుకుతాయి..నామినేషన్ ఎలా వేయాలన్న సూచనలు కూడా చేసింది. ఓడిపోయినా వెనక్కు తగ్గేది లే అంటోన్న శిరీషకు ఈ సారి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో వేచి చూడాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =