ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేయడం చాలా సంతోషానిచ్చింది: జస్టిస్ జెకె మహేశ్వరి

Andhra Pradesh High Court Judge, AP HC Judge, Chief Justice of Andhra Pradesh, Chief Justice of the Andhra Pradesh High Court, High Court Chief Justice, Justice Arup Kumar Goswami, Justice Joymalya Bagchi, Justice Joymalya Bagchi As AP HC Judge, Justice Joymalya Bagchi Takes Oath As AP HC Judge, Mango News, Sikkim High Court Chief Justice

ప్రఖ్యాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం కలగడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకె మహేశ్వరి పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసి సిక్కిమ్ హైక్టోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న జస్టిస్ జెకె మహేశ్వరికి సోమవారం నాడు అమరావతి హైకోర్టులో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బదిలీపై వెళుతున్నసీజే జస్టిస్ జెకె మహేశ్వరి మాట్లాడుతూ సహచర న్యాయమూర్తులు, ఇతర అందరి సమిష్టి కృషి సహకారంతో ఈహైకోర్టు ప్రఖ్యాతిని మరింత ఇనుమడింపచేసే రీతిలో తనవంతు ప్రయత్నం చేశానని పేర్కొన్నారు.

తాను గ్రామీణ ప్రాంతం నుండి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈస్థాయికి వచ్చానని కష్టించి పనిచేయడం ద్వారా వ్యవస్థ ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు తన వంతు కృషి చేశానని చెప్పారు. ఇందుకుగాను ప్రతి ఒక్కరికీ పేరుపేరున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తాను ఇక్కడి చీఫ్ జస్టిస్ గా తక్కువ కాలం పనిచేసినప్పటికీ ఇక్కడ పనిచేయడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని జస్టిస్ జెకె మహేశ్వరి పునరుద్ఘాటించారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ అనేక సవాళ్ళను అధికమించి న్యాయవ్యవస్థకు సంబంధించి ప్రతిష్టను కాపాడేందుకు తనవంతు కృషి చేశానని పేర్కొన్నారు. ముఖ్యంగా మొదటి రాష్ట్ర స్థాయి జుడీషియల్ ఆఫీసర్స్ కాన్పరెన్సును ఇక్కడ నిర్వహించుకోగలిగామని తెలిపారు. కోవిడ్ పరిస్థితులున్నప్పటికీ హైకోర్టు వీడియో కాన్పరెన్సు విధానంలో వివిధ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని చెప్పారు. ఈహైకోర్టు ప్రతిష్టను మరింత ఇనుమడింపచేయడం తోపాటు ఈసంస్థకు మరిన్ని పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జస్టిస్ జెకె మహేశ్వరి సూచించారు.

ఈవీడ్కోలు సభలో హైకోర్టు జడ్జి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జస్టిస్ జెకె మహేశ్వరి ఎంతో కష్టించి పనిచేసి ఈహైకోర్టుకు మరింత మంచి పేరు తీసుకవచ్చేందుకు తన వంతు కృషి చేశారని కొనియాడారు. ముఖ్యంగా కరోనా సమయంలో లోక్ అదాలత్ నిర్వహణ ద్వారా అనేక కేసుల సత్వర పరిష్కారానికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గా ప్రసాదరావు మాట్లాడుతూ వ్యక్తులు వస్తుంటారు వెళుతుంటారని కాని వ్యవస్థ అనేది శాశ్వతమని పేర్కొన్నారు. ఈహైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ జెకె మహేశ్వరి అనేక సందర్భాల్లో తన ముద్రను స్పష్టంగా చాటుకున్నారని తెలిపారు. ఎంతో ఓర్పు సహనగుణంతో పాటు కష్టించి పనిచేసే మనస్థత్వంతో జస్టిస్ జెకె మహేశ్వరి మంచి సేవలందించారని కొనియాడారు.

రిజిస్టార్ జుడీషియల్ మాట్లాడుతూ జస్టిస్ జెకె మహేశ్వరి నేతృత్వంలో మొదటి రాష్ట్ర జుడీషియల్ ఆఫీసర్స్ కాన్పరెన్సును ఇక్కడ నిర్వహించుకోగలిగామని పేర్కొన్నారు. జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలో హైకోర్టులో 4వేల 620 కేసులను పరిష్కరించారని తెలిపారు. అలాగే లోక్ అధాలత్ ద్వారా హైకోర్టులో 2వేల 652 కేసులు, వివిధ సబార్డినేట్ కోర్టులకు సంబంధించి 90వేల 407 కేసులను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. కోవిడ్ సమయంలో వీడియో కాన్పరెన్సు విధానం ద్వారా లక్షా 26వేల 84 కేసులు రిజస్టర్ కాగా వాటిలో 18వేల 933 కేసులను పరిష్కరించడం జరిగిందని చెప్పారు. జస్టిస్ మహేశ్వరి సీజేగా ఉన్న సమయంలో నలుగురు కొత్త జడ్జిలు ఇక్కడకు వచ్చారని తెలిపారు. అనంతరం సిక్కిం హైకోర్టుకు బదిలీపై వెళుతున్న సీజే జెకె మహేశ్వరిని హైకోర్టు న్యాయమూర్తులు దుస్సాలువ, జ్ణాపికలతో ఘనంగా సత్కరించారు. ఈవీడ్కోలు సభలో పలువురు హైకోర్టు న్యామమూర్తులు వారి సతీమణులు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 9 =