
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం నుంచి టీడీపీ ప్రభుత్వంగా మారిన గవర్నమెంటుపై సామాన్యులు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీనికి తగ్గట్టే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొన్ని నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు సొంతమైన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు. దీనిలో భాగంగానే జగనన్న విద్యాదీవెన కానుక స్కీమ్ పేరును స్టూడెంట్ కిట్‌గా మార్చిన చంద్రబాబు .. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వృద్ధులు, వితంతువులతో పాటు మరికొందరికి ఆర్థిక సహయం అందించడానికి జగన్ ప్రభుత్వం వైఎస్సాఆర్ ఆసరా పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పథకం పేరును టీడీపీ ప్రభుత్వం మార్చింది. వైఎస్సాఆర్ ఫించన్ పథకం పేరును తొలగించి..ఆ స్థానంలో ఎన్టీఆర్ భరోసా స్కీమ్‌గా పేరును పునరుద్ధరించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి పింఛన్ దారులకు కీలక హామీ ఇచ్చింది. కూటమి కనుక అధికారంలోకి వస్తే నెలకు రూ.4 వేలు పింఛన్ అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లుగానే..ఈ పింఛన్‌ను ప్రభుత్వం పెంచింది. అయితే కేవలం పథకాలు పేరు మార్పును సూచిస్తున్నారు తప్ప.. అనవసర ఖర్చులకు కక్ష సాధింపులకు పోయి పథకాల మీద ఉన్న జగన్ ఫోటోను తొలగించే పనులు చేయకపోవడం చంద్రబాబు విజ్ఞతను తెలియజేస్తుందని.. ఇది వైసీపీ నేతలు గమనించాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE