కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వ సారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసారి చంద్రబాబును కుప్పంలో ఓడించేందుకు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఆయన్ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండా చేసేందుకు యత్నించారు. గతంలో కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ,మండల పరిషత్, జిల్లా పరిషత్, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో 90 శాతాలను వైసీపీ కొల్లగొట్టింది. అయినప్పటికీ కుప్పం ప్రజలు చంద్రబాబు వైపే నిలబడ్డారు. మరోసారి ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. భారీ మెజార్టీని అందించారు.
ఎన్నికల ప్రచారం వేళ.. ఎన్నికల్లో గెలవగానే కుప్పం వస్తానని పార్టీ నేతలను, ప్రజలను కలుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన గెలవడంతో పాటు కూటమి కూడా ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఈక్రమంలో చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. జూన్ 25, 26వ తేదీల్లో కుప్పంకు వెళ్లనున్నారు. ఆయన్న ఎనిమిదోసారి భారీ మెజార్టీతో గెలిపించిన కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. ఎన్నికలకు ముందు కుప్పంలో వైసీపీ దాడుల్లో బాధితులయిన వారిని కూడా చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు.
గతంలో వైసీసీ ప్రభుత్వ హయాంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. పలువురిపై హత్యాయత్నం కేసులు కూడా పెట్టారు. వారిలో కొందరు చిత్తూరు జైల్లో ఉండగా.. మరికొందరు బెయిల్పై బయటికి వచ్చారు. వారిని కూడా చంద్రాబు నాయుడు కలవనున్నారు. అలాగే కుప్పం నియోజకవర్గంలోని పలు సమస్యలకు కూడా చంద్రబాబు నాయుడు పరిష్కారం చూపనున్నారు. అంతేకాకుండా కుప్పం ప్రజలకు చంద్రబాబు నాయుడు పలు వరాలు కూడా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY