ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్

Andhra Pradesh panchayat elections, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections News, AP Local Body Polls, AP Panchayat polls, AP Panchayat polls 2021, AP State TDP President Atchannaidu, AP State TDP President Atchannaidu Arrested, AP State TDP President Atchannaidu Arrested by Police, Atchannaidu Arrested, Former minister Atchannaidu arrested, Mango News, Panchayat polls, TDP MLA Atchannaidu, TDP President Atchannaidu Arrested

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం నాడు అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో మరోసారి నిమ్మాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందుగా నిమ్మాడలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో మొత్తం 22 మందిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇందులో కొంతమందిని సోమవారమే అరెస్టు చేయగా, తాజాగా అచ్చెన్నాయుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =