రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మార్చేస్తున్నారు. ఇప్పటి వరకు 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను.. 9 సిట్టింగ్ ఎంపీలను జగన్ ఛేంజ్ చేశారు. త్వరలో నాలుగో విడత ద్వారా మరికొంత మందిని కూడా మార్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఈసారి కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తున్నారు. యువనేతలతో పాటు ఆసక్తిగావున్న ప్రభుత్వాధికారులను కూడా బరిలోకి దింపుతున్నారు.
గత ఎన్నికల్లో హిందూపురం సీఐ గోరంట్ల మాధవ్‌కు జగన్ టికెట్ ఇచ్చారు. మాధవ్ హిందూపురం నుంచి వైసీపీ తరుపున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అయితే ఈసారి మాధవ్‌లానే మరో సీఐకి టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో ఎస్ఐ, సీఐగా పనిచేసి.. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న శుభకుమార్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకు టికెట్ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక సిట్టింగ్‌ల మార్పులో భాగంగా అనంతపురంలో జగన్ కీలక మార్పులు చేశారు. హిందూపురం ఎపీ గోరంట్ల మాధవ్‌ను ఈసారి జగన్ పక్కకు పెట్టేశారు. ఆయన స్థానంలో కర్ణాటక మాజీ మంత్రి బి.శ్రీరాములు సోదరి శాంతికి టికెట్ ఇచ్చారు. అలాగే ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపుతున్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్‌ను అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. ఇదేక్రమంలో మడకశిర సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి ఈసారి జగన్ షాక్ ఇచ్చారు. ఆయనకు టికెట్ నిరాకరించారు.
అయితే తిప్పేస్వామి స్థానంలో మడకశిర నుంచి సీఐ శుభకుమార్‌ను బరిలోకి దింపాలని జగన్ అనుకుంటున్నారట. మడకశిర ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అటు శుభ కుమార్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆయన వైపు జగన్ మొగ్గుచూపుతున్నారట. అంతేకాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయనకు మంచి ఆఫీసర్‌గా గుర్తింపు ఉంది. ఈక్రమంలో మడకశిర టికెట్ శుభకుమార్‌కేనని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని శుభకుమార్ కలవడం ప్రధాన్యత సంతరించుకుంది. మరి ప్రచారం జరుగుతున్నట్లుగానే మడకశిర టికెట్ శుభకుమార్‌కే కేటాయిస్తారా..? ఒకవేళ ఆయన టికెట్ ఇస్తే.. తిప్పేస్వామిని ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE