వైసీపీలోకి వంగవీటి రాధా?.. ఇదీ క్లారిటీ

Vangaveeti Radha in YCP this is Clarity,Vangaveeti Radha in YCP,Vangaveeti Radha Clarity,Vangaveeti radha, TDP, AP Politics, AP Assembly elections,Mango News,Mango News Telugu,Vangaveeti Radha gives clarity,Jagan and Vangaveeti Radha,Vangaveeti Radha Latest News,Vangaveeti Radha Latest Updates,AP Assembly elections Latest News,AP Assembly elections Live Updates
Vangaveeti radha, TDP, AP Politics, AP Assembly elections

ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల ముంగిట జంపింగ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి కొందరు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. టికెట్ దక్కలేదని మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా గోడలు దూకేందుకు సిద్ధమవుతున్నారు. అటు టీడీపీ నుంచి కూడా వైసీపీలోకి కొందరు నేతలు వెళ్లారు. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈక్రమంలో వంగవీటి రాధాకృష్ణ కూడా వైసీపీలో చేరబోతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

అయితే కొద్దిరోజులుగా వంగవీటి రాధా టీడీపీ హైకమాండ్‌కు దూరంగా ఉంటున్నారు. పార్టీలో సరైన ప్రధాన్యత లేకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీ నేతలతో రాధా టచ్‌లో ఉంటున్నారు. వల్లభనేని వంశీ, పేర్ని నాని, కొడాలి నానిలతో కలిసి తిరుగుతున్నారు. ఇటీవల రాధా కాశీకి వెళ్లగా.. ఆయనతో పాటు కొడాలి నాని కూడా కాశీకి వెళ్లారు. ఈ పరిణామాల మధ్య రాధా వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. రేపో.. మాపో రాధాకృష్ణ వైసీపీలో చేరుతారని వార్తలొచ్చాయి.

రాధాకృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఏపీలో కాపులదే పైచేయి. అందుకే ప్రధాన పార్టీలన్నీ కాపులను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈక్రమంలో రాధాను వైసీపీలో చేర్చుకోవడం వల్ల కొంతమేర అయినా కాపులు తమవైపు వచ్చే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి భావించారట. అందుకే ఆయన్ను పార్టీలోకి తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇదే సమయంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును జగన్ ఈసారి పక్కకు పెట్టేసి.. వెలంపల్లి శ్రీనివాస్‌కు ఆ టికెట్ ఇచ్చారు. ఒకవేళ వంగవీటి రాధా వైసీపీలోకి వస్తే.. వెలంపల్లిని ఈజీగా తప్పించి ఆ టికెట్ రాధాకు ఇవ్వొచ్చని జగన్ అనుకున్నారట. ఈ పరిణామాల మధ్య రాధా వైసీపీలో చేరడం ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది.

అయితే ఇన్నిరోజులు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ స్పందించని రాధాకృష్ణ తాజాగా స్పందించారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలుగు దేశం పార్టీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వైసీపీ నేతలనే టీడీపీలోకి ఆహ్వానించారు. ఇటీవల వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బొప్పన భవనకుమార్ ఇంటికి రాధా వెళ్లారు. ఆయన్ను స్వయంగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మరికొంత మంది వైసీపీ నేతలను కూడా టీడీపీలోకి ఆహ్వానించారు. దీంతో ఇన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడినట్లు అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − nine =