ఏపీలో 5వేల ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు – సీఎం చంద్రబాబు కీలక ఆదేశం

CM Chandrababu Directs Officials For Establishment of 5,000 EV Charging Stations Across AP

రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన తాజాగా రాష్ట్ర విద్యుత్ శాఖ పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, భవిష్యత్తు ప్రణాళికలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఈ సమావేశంలో కీలకమైన విద్యుత్ ప్రాజెక్టుల పురోగతి మరియు ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమకు సంబంధించిన ప్రోత్సాహకాలపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ విజయానంద్, ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల సీఎండీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
  • క్లీన్ ఎనర్జీ పాలసీ అమలు: రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు ‘ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ’ కింద 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

  • అనుమతులు త్వరగా ఇవ్వాలి: క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలుంటే వాటిని త్వరగా పరిష్కరించి, ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

  • పీఎం కుసుమ్, రూఫ్‌టాప్ ప్రాజెక్టులు: పీఎం కుసుమ్ మరియు రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని సూచించారు.

  • నాణ్యమైన విద్యుత్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలి. ఉత్పత్తికి లోటు లేకుండా ఉండేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

  • ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు: రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలి.
పరిశ్రమలకు ఊతం
  • ఫెర్రో అల్లాయీస్ ప్రోత్సాహకాలు: ముఖ్యమంత్రి ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమలను కీలకమైన పరిశ్రమలుగా గుర్తించి, వాటికి ఇస్తున్న ప్రోత్సాహకాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

  • ప్రభుత్వంపై భారం: ఈ ప్రోత్సాహకాల పొడిగింపు వల్ల ప్రభుత్వంపై సుమారు ₹1,053 కోట్ల ఆర్థిక భారం పడనుంది.

పీఎస్‌పీలపై అధ్యయనం
  • పీఎస్‌పీలు: రాష్ట్రంలోని రిజర్వాయర్లు మరియు ఇతర ప్రాజెక్టుల వద్ద పంప్డ్ స్టోరేజ్ పవర్ (PSP) ప్రాజెక్టుల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీని ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here