చంద్రబాబు తొలి సంతకం ఆ ఫైల్ పైనే..

Cm Chandrababu Naidu Was The First To Sign The File Related To Mega DSC,The First To Sign The File Related To Mega DSC,CM Chandrababu Naidu Was The First To Sign To Mega DSC,CM Chandrababu,Mega DSC, Chandrababu First Sign,AP, CM Chandrababu Naidu,AP Live Updates, AP Politics, Political News,Andhra Pradesh, Mango News, Mango News Telugu
cm chandrababu naidu, chandrababu first sign, mega dsc, ap

ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్ల తర్వాత తెలుగు దేశం కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయ దుందుభి మోగించింది. ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈక్రమంలో చంద్రబాబు నాయుడు తన తొలి సంతకాన్ని ఏ ఫైల్ పైన చేస్తారనే దానిపై కొద్దిరోజులుగా చర్చ జరగుతోంది. ఈ హామీలకు సంబంధించిన ఫైల్ పైనే సంతకం చేస్తారంటూ పలు అంశాలు కూడా వైరలయ్యాయి.

ఈక్రమంలో గురువారం చంద్రబాబు నాయుడు సచివాలయం మొదటి బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకున్నారు. సాయంత్రం 4:41 గంటలకు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అయితు ఫైల్లపై చంద్రబాబు సంతకాలు చేశారు. చెప్పినట్లుగానే తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఫైల్‌పై చేశారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్‌పై చేశారు.

సామాజిక పింఛన్లను రూ. 4 వేలకు పెంచే ఫైల్‌పై చంద్రబాబు మూడో సంతకం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించిన ఫైలుపై నాలుగో సంతకం.. నైపుణ్య గణనకు సంబంధించిన ఫైలుపై అయిదో సంతకం చేశారు. మెగా డీఎస్సీలో 16,347 పోస్టులు ఉన్నాయి. అందులో సెండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 6,371.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,725.. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 132.. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 1781.. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 286.. ప్రిన్సిపల్ పోస్టులు 52 ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE