ఏపీలో ఎన్నికల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. కూటమి నేతలంతా సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తుంటే .. జగన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే సరిగ్గా ఇలాంటి సమయంలో.. జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో తొమ్మిది రోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ కూటమిని ఇరుకున పెట్టే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు.
జగన్ తన హామీలలో భాగంగా.. ఇప్పటికే అమలులో ఉన్న నవరత్నాలను కొనగిస్తూనే అమ్మఒడి, రైతు భరోసా, పింఛన్ పెంపుతో మరోసారి ప్రజా తీర్పు కోసం వెళ్తున్నారు. అయితే టీడీపీ కూటమి మేనిఫెస్టోలో ..బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీనినే ప్రధాన అస్త్రంగా తీసుకున్న జగన్ ప్రతీ సభలో చంద్రబాబు హామీలను నమ్మవద్దని..2014లో చెప్పిన హామీలను ఇంకా అమలు చేయలేదని చెబుతూ.. తన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.
మరోవైపు వైఎస్సార్సీపీ నవరత్నాల ప్లస్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రతి గడపకూ తీసుకెళ్లి , ప్రతీ ఓటరుకు రీచ్ అయ్యేలా జగన్ ప్రణాళికలు ఉన్నాయి. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని నిరుపేదలను టార్గెట్ చేసుకుని తమ పథకాలు అర్ధమయ్యేలా వివరిస్తున్నారు. దీని కోసం ఏపీలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, పట్టణాలు, పల్లెల్లోని ప్రతి ఇంటికి ఈ అంశాలు చేరేలా కార్యాచరణను అమలు చేస్తున్నారు.
జగన్ కోసం సిద్ధం నినాదంతో ముందుకెళుతోన్న పార్టీ క్యాడర్ … టీడీపీ,జనసేన మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేదని, సాధ్యం కాని హామీలను చంద్రబాబు ఇచ్చారంటూ ఈ ప్రచారంలో వైసీపీ శ్రేణులు ప్రధానంగా వివరిస్తున్నారు. అటు జగన్ ప్రచారంలో విశ్వసనీయత గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా.. ప్రచారానికి మరో 8 రోజుల సమయమే ఉండటంతో.. మేనిఫెస్టోను ప్రతీ ఇంటికి తీసుకెళ్తున్నారు. కేవలం తమ దృష్టి అంతా మేనిఫెస్టో మీద పెట్టిన వైసీపీ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY