వారంలో 2 రోజులు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తా : సీఎం వైఎస్ జగన్

Andhra Pradesh CM Jagan to speed up vaccination, Andhra Pradesh CM Jagan to visit village secretariats twice, Andhra Pradesh CM YS Jagan, Chief Minister plans weekly visits to the ward /village Secretariats, CM to visit village sectts twice a week, CM YS Jagan Decides to Visit Village, CM YS Jagan Decides to Visit Village Ward Secretariats for 2 Days in Week Soon, Corona Vaccination In AP, Mango News, Pittigunta village, Village Ward Secretariats

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం నాడు స్పందనపై స‌మీక్ష‌లో భాగంగా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టగానే వారంలో 2 రోజులు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శిస్తానని తెలిపారు. అలాగే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు కూడా గ్రామ/వార్డు సచివాలయాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో 200 సేవలను అదనంగా ప్రజలకు అందించబోతున్నామ‌ని, మొత్తంగా 740 సేవలు అందబోతున్నాయన్నారు.

అదే సమయంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని, అర్హులైన వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు అందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇక 104 కాల్‌ సెంటర్‌ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ కావాలని, థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ సెకండ్‌ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ