కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, AP CM YS Jagan Delhi Tour, AP CM YS Jagan Delhi Tour Updates, CM Jagan Reddy to meet PM Modi, CM YS Jagan Delhi Tour, CM YS Jagan Meets Union Minister Nitin Gadkari, CM YS Jagan Meets Union Minister Nitin Gadkari at Delhi, Delhi, Mango News, YS Jagan Delhi Tour, YS Jagan meets Union Minister Nitin Gadkari, YS Jagan To Visit Delhi

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా.. సీఎం జగన్ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర సమస్యలపై వినతిపత్రం అందించారు. పోలవరం, మూడు రాజధానులు అంశం, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, పలు ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ నిధులు, విభజన చట్టం హామీల అమలు, తదితర అంశాలపై చర్చించారు. ఆ తర్వాత, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియాలను వేర్వేరుగా కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించి, రాష్ట్రానికి కేంద్రం నుంచి సాయం అందించాల్సిందిగా కోరారు.

ఈ రోజు ఢిల్లీలో తన రెండవ రోజు పర్యటనను కొనసాగిస్తున్నారు సీఎం జగన్. దీనిలో భాగంగా.. ఈ ఉదయం కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రమంత్రితో చర్చించినట్లు సమాచారం. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా జగన్ బేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు సీఎం జగన్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ