ఐదేళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటి?

Who Do You Vote For Voters In Ungutur Constituency?,Ungutur Constituency,YCP,Janasena,TDP,BJP,Chandrababu,Puppala Srinivasa Rao,Jana Sena Candidate,Patsamatla Dharmaraju,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,Ungutur Constituency Elections,Ungutur,Ungutur Elections,Ungutur Politics,Unguturu Assembly Elections 2024,Unguturu News

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దేవాల‌యాల‌ను వైసీపీ ప్ర‌భుత్వం పూర్తి నిర్ల‌క్ష్యం చేసింది. దీనికి నిద‌ర్శ‌నం ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గం. చిన్న తిరుప‌తిగా ప్ర‌సిద్ధ చెందిన ద్వార‌కా తిరుమ‌ల ఆల‌యం ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంది. నిత్యం వేలాదిమంది భ‌క్తులు ఈ ఆల‌యానికి వ‌స్తుంటారు. ఈప్రాంతానికి స‌రైన ర‌హ‌దారులు వేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. క‌నీసం ర‌హ‌దారుల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయించ‌లేని దుస్థితి నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా అభివృద్ధి చేయ‌డంలో ఆయ‌న విఫ‌ల‌మ‌య్యారు. ఈ జిల్లాలోనే దేవాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ ఉన్నా.. ద్వార‌కా తిరుమ‌ల‌ను అభివృద్ధి  చేయ‌లేదు.

భీమడోలు, ద్వారకాతిరుమల, ఉంగుటూరు , నల్లజర్ల మండలాలు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నాయి. పూర్తి గ్రామీణ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించే ఉంగుటూరుకు చారిత్ర‌క, రాజ‌కీయ‌ నేప‌థ్యం ఉంది. వ్య‌వ‌సాయం ఇక్క‌డి ప్ర‌జ‌ల జీవ‌నాధారం.  గోదావరి డెల్టా కాలువల ఆధారిత వ్యవసాయ ప్రాంతం ఇది. ఓవైపు వరి పైరులు మ‌రోవైపు చేపలు, రొయ్యల చెరువులు అధికం.  రైసుమిల్లులకు కేంద్రమైన ఈ నియోజకవర్గం ఆక్వా ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆశాజ‌న‌కంగా లేదు. సీఎం జ‌గ‌న్ ఎన్నో హామీలు ఇచ్చినా అమ‌లు చేయ‌లేక‌పోయారు. ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌తో ఇక్క‌డి యువ‌త‌కు ఆశించిన స్థాయిలో ఉపాధి అవ‌కాశాలు ద‌క్క‌లేదు.

స్వతంత్ర సమరయోధులు దివంగత చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తి రాజు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గం ఉంగుటూరు. ఆయ‌న స్వతంత్ర సమర పోరాటంలో గాంధీజీతో కలిసి పోరాడి,  మ‌హాత్ముడిపై అనేక రచనలు రాశారు. స్వగ్రామంలో పార్లమెంటును పోలివుండే భవనాన్ని నిర్మించి గాంధీపై రచనలతో కూడిన లైబ్రరీని ఏర్పాటుచేశారు. అంత‌టిఘ‌న చరిత్ర ఉన్న ఉంగుటూరు అభివృద్ధి వైసీపీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. నియోజకవర్గాన్ని వేధిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌లు తాగునీరు, అధ్వాన‌స్థిలో ఉన్న ర‌హ‌దారులు. ఐదేళ్ల కాలంలో రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఎటువంటి ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్ట‌లేదు. విద్య‌, వైద్య సౌక‌ర్యాలు నియోజ‌క‌వ‌ర్గంలో అంతంత‌మాత్రంగానే ఉన్నాయి. పై చ‌దువుల కోసం తాడేప‌ల్లిగూడెం. ఏలూరు వెళ్లాల్సిన ప‌రిస్థితి. డ్రెయినేజీ స‌మ‌స్య ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌ను పీడిస్తుంది.

2019 ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పుప్పాల శ్రీనివాస‌రావు గెలుపొందారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న తిరిగి వైసీపీ నుంచి పోటీచేస్తున్నారు. ఎన్డీయే కూట‌మి త‌ర‌పున జ‌న‌సేన అభ్య‌ర్థి ప‌త్స‌మ‌ట్ల ధ‌ర్మ‌రాజు పోటీచేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాస‌రావు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు చేసిన మంచి ప‌నులేమి లేవు. ద్వారకా తిరుమ‌లను అభివృద్ధి చేయ‌లేదు. జ‌న‌సేన అభ్య‌ర్థి ధ‌ర్మ‌రాజు నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే వ్య‌క్తి. ఎటువంటి స‌మ‌స్య ఉన్నా ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటూ స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యే వ‌ర‌కు నిల‌బ‌డే వ్య‌క్తి. ఎన్నిక‌ల‌ప్పుడు ప్ర‌జ‌ల్లోకి రావ‌డం కాకుండా నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే వ్య‌క్తి ధ‌ర్మ‌రాజు. ఈ ఎన్నిక‌ల్లో ధ‌ర్మ‌రాజును గెలిపించుకోవ‌డం ద్వారా ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. వెంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువై  ఉన్న ఈ ప్రాంతాన్ని టెంపుల్ టౌన్‌గా అభివృద్ధి చేసుకోవ‌డానికి జ‌న‌సేన అభ్య‌ర్థి ధ‌ర్మ‌రాజును గెలుపిద్దాం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =