రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ అందేలా చర్యలు : సీఎం జగన్

520 black spots on roads across Andhra Pradesh, AP CM Conducts Road Safety Council Meeting, AP Road Safety, AP Road Safety Council Meeting, AP Road Safety Meeting, AP to spend Rs 2205 crore for road development in 2022, CM YS Jagan, CM YS Jagan Takes Key Decisions in AP Road Safety Council Meeting, Key Decisions in AP Road Safety Council Meeting, Mango News, Road Safety Council Meeting Chaired By CM Jagan, YS Jagan Takes Key Decisions in AP Road Safety Council Meeting

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం క్యాంప్ కార్యాలయంలో రహదారి భద్రతా మండలి (ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, కారణాలు తదితర అంశాలను సీఎంకు అధికారులు వివరించారు. ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడంలో 108లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, నిర్దేశిత సమయంలోగా పేషెంట్లను ఆస్పత్రులకు చేర్చాలన్న 108లో నిబంధన ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్న అధికారులు తెలిపారు. అలాగే గోల్డెన్ అవర్ లోగా వారిని ఆస్పత్రులకు చేర్చడంతో చాలామంది ప్రాణాలు నిలబడుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1190 బ్లాక్ స్పాట్స్ గుర్తించామని, 520 స్పాట్స్ రెక్టిఫై చేశామని, ఆర్ అండ్ బి నిర్వహిస్తున్న నేషన్ హైవేల్లో కూడా 78 బ్లాక్ స్పాట్స్ రెక్టిఫై చేశామని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రతిపార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం సహకారంతో కలిపి ఒక డ్రైవింగ్ స్కూలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సదుపాయాలను ఆర్టీసీ వినియోగించుకోవడంతో పాటు, డ్రైవింగ్ శిక్షణ కోసం వినియోగించుకోవచ్చన్నారు. ట్రామా కేర్ సెంటర్లను కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్ కళాశాలల్లో కూడా ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యాధునిక పద్ధతుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు అందించాలని చెప్పారు. ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా రీహాబిలిటేషన్ సెంటర్‌ను వైజాగ్ లో ఉంచాలని, అలాగే తిరుపతి బర్డ్ ఆస్పత్రుల్లో ఉన్న సెంటర్‌ను మెరుగుపరచాలని సూచించారు.

ఇక రోడ్డుపై లేన్ మార్కింగ్ చాలా స్పష్టంగా ఉండేలా చూడాలన్నారు. బైక్ లకు ప్రత్యేక లేన్, ఫోర్ వీల్ వాహనాలకు ప్రత్యేక లేన్స్ ఏర్పాటుపై ఆలోచన చేయాలని, ఎంత స్పీడులో పోవాలన్నదానిపై కూడా సైన్ బోర్డులు పెడితే చాలావరకు ప్రమాదాలు తగ్గే ఆస్కారం ఉందన్నారు. మరోవైపు రోడ్లు పక్కన ధాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలని సీఎం సూచించారు. దీనివల్ల చాలావరకు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ముఖ్యమైన రోడ్ల పక్కన యాక్సెస్ బారియర్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని పునఃసమీక్షించాలని, క్రమం తప్పకుండా రివ్యూ చేసుకుని రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేయాలని సూచించారు. జిల్లాల వారీగా ఏర్పాటవుతున్న కమిటీలు కూడా రోడ్డు ప్రమాదాలపై సమీక్ష చేయాలన్నారు.

రోడ్డు భద్రతా మండలి సమావేశంలో పలు నిర్ణయాలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్:

  • రోడ్ సేఫ్టీ మీద లీడ్ ఏజెన్సీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
  • పోలీసు, ట్రాన్స్పర్ట్, హెల్త్ మరియు రోడ్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ నుంచి నిపుణులు ఇందులో ఉంటారు.
  • రోడ్ సేప్ట్ ఫండ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
  • ప్రమాద బాధితులకు చికిత్స కోసం క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ అందేలా నెట్ వర్క్ ఆస్పత్రుల జాబితాలోకి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం
  • రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తీసుకొచ్చే వారిపట్ల మంచి సపోర్టు ఇవ్వాలి
  • ఐరాడ్ యాప్ వినియోగించుకుని ప్రమాదాలపై లైవ్ అప్ డేట్ పొందేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి
  • పీపీపీ పద్ధతిలో రవాణా శాఖ ద్వారా ఆటోమేటెడ్ ఎఫ్సీ టెస్టింగ్ ఏర్పాటుపై కార్యాచరణ
  • రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ