గోవాలో నమోదైన భారీ పోలింగ్.. విజయంపై కాంగ్రెస్ విశ్వాసం

2022 Goa Assembly Elections, Assembly Elections, Elections, Elections 2022, Elections 2022 High Voter Turnout, Elections 2022 High Voter Turnout Sign, Elections 2022 High Voter Turnout Sign of Anti-Incumbency, Elections 2022 High Voter Turnout Sign of Anti-Incumbency Says Goa Congress, Goa, Goa Assembly Elections, Goa Assembly Elections 2022, Goa Congress, Goa Elections, Goa Elections 2022, Mango News

సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో అత్యధిక ఓటింగ్ నమోదు కావడంతో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై విశ్వాసం వ్యక్తం చేసింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అధికారిక సమాచారం ప్రకారం, గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 78.94 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే రాష్ట్రంలో 2017 నాటి 81.21 శాతం కంటే కొంచెం తక్కువగా ఉంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) గోవా ఇన్‌ఛార్జ్ దినేష్ గుండూరావు మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల నుంచి వ్యక్తమైంది. నిన్న ఇక్కడ ఓటింగ్ భారీగా జరగడానికి అది ప్రధాన కారణం. ఇది కాంగ్రెస్‌కు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మేము రాష్ట్రంలో పూర్తి మెజారిటీని సాధించబోతున్నాం” అని తెలిపారు.

ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను బిజెపి పోటీకి నిలబెట్టిన సాంక్వెలిమ్‌లో అత్యధికంగా ఓటింగ్‌ నమోదైంది. “ముఖ్యమంత్రిపై విపరీతమైన కోపం ఉందని ఇది చూపిస్తుంది. ఎన్నికలలో ఓడిపోయానని తెలిసి ముఖ్యమంత్రి హతాశుడైపోయి ఇంటింటికీ వెళ్లడం ఆయన నియోజకవర్గంలో చూశాం. ఆయన నియోజకవర్గంలో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది. మాకు మంచి విషయం. మా కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో గెలుస్తారు” అని రావు అన్నారు. ఇక్కడ సావంత్‌పై కాంగ్రెస్‌ ధర్మేష్‌ సగ్లానీని రంగంలోకి దింపింది. సావంత్ సాంక్వెలిమ్ స్థానం నుంచి రెండుసార్లు గెలుపొందడం గమనార్హం. అతను 2008 ఉప ఎన్నికలో పాలే నుండి ఓడిపోగా, సావంత్ 2012 మరియు 2017లో సాంక్వెలిమ్ లేదా సంఖాలీ స్థానం నుండి గెలిచాడు. గోవా ఫార్వర్డ్ పార్టీ (జిఎఫ్‌పి)తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ గోవా ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 13 =