ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా తిరుపతిలో కరోనా ప్రభావం ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆగస్టు 14 వరకు తిరుపతి నగరంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగించారు. ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ పి.ఎస్ గిరీష ప్రకటించారు.
లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలు, మెడికల్ షాపులకు మినహా మిగతా అన్ని రకాల షాపులకు ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పనులుంటేనే ప్రజలు బయటకి రావాలని చెప్పారు. లాక్‌డౌన్ నిబంధనలను ఎవరైనా వ్యాపారులు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ అన్నారు. మరోవైపు ఆగస్టు 16 నాటికీ చిత్తూరు జిల్లాలో 23459 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 14093 మంది కోలుకోగా, 235 మంది మరణించారు. ప్రస్తుతం 9131 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu