ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,814 కు చేరుకుంది. గత 24 గంటల్లో 64099 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 478 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 58, కర్నూల్ జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 62, కడప జిల్లాలో 19, గుంటూరు జిల్లాలో 48, చిత్తూరు జిల్లాలో 89, అనంతపూర్ జిల్లాలో 30, నెల్లూరు జిల్లాలో 17, ప్రకాశం జిల్లాలో 12, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 44, విజయనగరంలో 17, పశ్చిమగోదావరిలో 63 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో మరో 3 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 7067 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 715 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 8,65,327 కు చేరింది. అలాగే ప్రస్తుతం 4420 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక డిసెంబర్ 16 నాటికీ ఏపీలో మొత్తం 1,10,01,476 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ