ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 19, బుధవారం ఉదయం 10 గంటల నాటికీ 30,19,296 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు 18-ఆగస్టు 19 (9AM-9AM) వరకు 24 గంటల వ్యవధిలో 57,685 శాంపిల్స్ (విఆర్డీఎల్+ట్రూనాట్+నాకో(34086), ర్యాపిడ్ యాంటిజెన్ -23599) ను పరీక్షించినట్టు తెలిపారు. దేశంలో ఇప్పటికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మాత్రమే 30 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించాయి.
కరోనా పరీక్షలు అధికంగా నిర్వహించిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా, తర్వాత స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్ ఉన్నాయి. అయితే మిలియన్ జనాభాకు దేశంలోనే అత్యధికంగా 56541 పరీక్షలు నిర్వహించి ఏపీ అగ్ర స్థానంలో కొనసాగుతుంది. ఏపీలో ప్రస్తుతం 14 వైరాలజీ ల్యాబ్స్, 85 ట్రూనాట్ ల్యాబ్స్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఆగస్టు 19 నాటికీ అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించ రాష్ట్రాలు:
- ఉత్తరప్రదేశ్ : 40,75,174
- తమిళనాడు : 39,13,523
- మహారాష్ట్ర: 33,43,052
- ఆంధ్రప్రదేశ్ : 30,19,296
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu