భారత్ కు మరో 100 వెంటిలేటర్లు అందజేసిన అమెరికా

America has Sent Second Shipment of 100 Ventilators to India to help to Fight on Covid-19

కోవిడ్-19 పై భారత్ చేస్తున్న పోరాటానికి సహాయంగా అమెరికా మరో 100 వెంటిలేటర్లను అందజేసింది. అమెరికా ఇలా వెంటిలేటర్లు అందజేయడం ఇది రెండోసారి. జూన్ 14 న మొదటి విడతగా 100 వెంటిలేటర్లను భారత్‌కు విరాళంగా ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యూఎస్‌ఏఐడీ కార్యక్రమంలో భాగంగా గతంలో 200 వెంటిలేటర్లు అందజేస్తామని హామీ ఇచ్చారని, అందుకు సంబంధించి మిగిలిన 100 కొత్త వెంటిలేటర్లను బుధవారం నాడు అందజేసినట్టు భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ తెలిపారు. అమెరికాలో తయారైన ఈ వెంటిలేటర్లు చాలా కాంపాక్ట్ గా ఉంటాయని, వారిని అమర్చడం, వాడడం సులభంగా ఉంటుందని చెప్పారు. కరోనా బాధితులకు చికిత్స అందజేసేందుకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. మరోవైపు కరోనా చికిత్సకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ ను ట్రంప్‌ అభ్యర్థన మేరకు భారత్ పెద్దసంఖ్యలో అమెరికాకు అందజేసిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 15 =