పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే

Aerial Survey Of Polavaram, Aerial Survey Of Polavaram Project, Andhra Pradesh, Godavari river, Mango News, Mango News Telugu, Penukonda, Polavaram Project, Pulivendula, Ram Nath Kovind, Venkaiah Naidu, YS Jagan, YS Jagan Conducts Aerial Survey, YS Jagan Conducts Aerial Survey Of Polavaram Project, YS Jagan To Conduct Aerial Survey

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 8న పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగుంచుకుని గురువారం మధ్యాహ్నం గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పోలవరం వెళ్లి ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాఫ్టర్ ద్వారా పరిశీలించడానికి వెళ్లారు. ఎగువన భారీ వర్షాల కారణంగా గోదావరిలో నదిలో ప్రహవం పెరగడంవలన పోలవరం మండలంలో 19 గ్రామాలు ముంపుకు గురవటంవలన వారికీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ గ్రామాలలో పరిస్థితులు తెలుసుకోవడానికి ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

ఈ ఏరియల్ సర్వేకి ముఖ్యమంత్రి జగన్ తో పాటు, మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అనిల్ కుమార్ కూడ వెంట వెళ్లారు. ఏరియల్ సర్వే అనంతరం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ వరద ముంపు పై, ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక పై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం తాడేపల్లికి బయలుదేరి వెళతారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీలను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కేంద్ర మంత్రులనే కాకుండా , భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కూడ కలసి రాష్ట్ర వ్యవహారాలను వివరించారు. కియా కంపెనీ ప్రతినిధుల ఆహ్వానం మేరకు ఆగస్టు 8న కియా తోలి కారు సెల్టోస్ విడుదల కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరు కావాల్సి ఉండగా, ఢిల్లీ పర్యటన పొడిగింపు కావడంతో షెడ్యూలు ప్రకారం ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here