నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘ఫెంగల్’ తుఫాన్ బలంగా మారుతోంది. ఇది ప్రస్తుతం పుదుచ్చేరికి 230 కి.మీ, చెన్నైకి 250 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్న ఈ తుఫాను నవంబర్ 30న మధ్యాహ్నం తర్వాత తమిళనాడు-పుదుచ్చేరి తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 70-80 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
వర్ష బీభత్సం.. రైతుల కష్టాలు
తుపాను ప్రభావంతో నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలతో IMD హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వరి పంట కోతలతో పాటు పంటలను కాపాడేందుకు టార్పాలిన్లు కప్పడం, నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవడం మొదలైన పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. తుఫాను వల్ల వచ్చే ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వాతావరణ పరిస్థితులు
వర్షాలు, గాలుల ప్రభావంతో ఉక్కపోతతో పాటు చలి తీవ్రత పెరుగుతోంది. ఏపీలో గాలి వేగం గంటకు 14 కి.మీ, తెలంగాణలో 11 కి.మీగా ఉంది. ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పు జరిగి రాత్రి వేళ మరింత చలి ఉంటుందని అంచనా. ఏపీలో ఉష్ణోగ్రత 27°C, రాత్రి 24°C వరకు ఉంటుంది. తెలంగాణలో 26°C ఉష్ణోగ్రత, రాత్రి 22°C వరకు ఉంటుంది.
చలికి ఇబ్బందులు తప్పవు..
తిరుమలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. పొగ మంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమలలో చిరుజల్లులతో పాటు మంచు దుప్పటిలా ఆవరించి భక్తులకు కష్టాలు పెంచుతోంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
నైరుతి బంగాళాఖాతంలో
'ఫెంగల్ ' తుపాన్ఉత్తర-వాయువ్య దిశగా పయనించనున్న 'ఫెంగల్ '
ప్రస్తుతానికి పుదుచ్చేరికి 230 కి.మీ, చెన్నైకి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ pic.twitter.com/6rNrj298Oz
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 29, 2024