
ముద్రగడ పద్మనాభం..కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నపేరు. అలా అని అతని కోసం రాజకీయ పార్టీలు ఎగబడటం వల్లే ఇంత పేరా అనుకుంటే అదీ కాదు. కేవలం తనంతట తాను క్రియేట్ చేసుకున్న రాజకీయ ప్లాట్ పామ్ మీద ఆయన పేరును రోజూ వినిపించేలా చేసుకుంటున్నారు. అందులోనూ ఎన్నికల సమయంలో పవన్ పార్టీలో చేరతానని కొద్ది రోజులు, వైసీపీ కండువా కప్పుకుంటానని మరికొద్ది రోజులు హడావుడి చేయడంతో జనాల చూపు ఆయన మీద పడింది. ఆ తర్వాత ఆయన ప్రమేయం కూడా అవసరం లేకుండానే బీజేపీలో చేరి గవర్నర్ అవుతారంటూ..జనసేన నో అనడంతో వైసీపీలో ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేస్తారంటూ పుకార్లు షికార్లు చేశాయి.
ఇలా మొత్తంగా రోజుకో విషయంతో సోషల్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వరకూ ముద్రగడ పేరు వినిపిస్తూనే ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం ముద్రగడకు రాజకీయాలలో మంచి రోజులు లేవన్న వార్తలే వినిపిస్తున్నాయి. దానికి స్వయంకృతాపరాధం కూడా కారణమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమయినా ఆయన చిరకాల వాంఛ తీరడం లేదన్న దిగులే ఎక్కువ కనిపిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలనుకున్న ఆయన కోరిక తీరడం లేదన్న ప్రచారం జరుగుతోంది.
కాపు సామాజిక వర్గానికి తానొక గొంతు అంటూనే జనసేన అధిపతి పవన్‌ను వెనక్కి లాగడానికి ఒక్క క్షణం ఆలోచించని నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఒక విధంగా చెప్పాలంటే గత ఎన్నికలకు ముందు, ఇప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం వైసీపీకి సానుకూలంగా వ్యవహరిస్తూనే వచ్చారు. అయితే ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో వైసీపీ అప్పుడు ,ఇప్పుడూ ఆటలో అరటిపండునే చేస్తుంది తప్ప ఎటువంటి సీటును కేటాయించలేదు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు. ఉద్యమం కాస్తా రైలు విధ్వంసానికి దారి తీయడం, వారిపై కేసులు నమోదు కావడంతో కాపుల ఆగ్రహానికి చంద్రబాబు గురయ్యారు. అయితే అప్పుడు ముద్రగడ అలా చేయడం వెనుక కాపులను చంద్రబాబుకు వ్యతిరేకంగా తయారు చేసి.. వైసీపీ వైపు వెళ్లేలా చేయడమేనన్న ఆరోపణలు ఉన్నాయి.
దానికి తగినట్లే వైసీపీ అధికారంలోకి వచ్చీ రాగానే ముద్రగడ ఉద్యమం ఊసే మరిచిపోయారు.చివరకు చంద్రబాబు సర్కార్ ఇచ్చిన కాపు రిజర్వేషన్లను జగన్ నిలిపివేసినా అదేంటని ప్రశ్నించలేదు.పైగా జగన్ కు అనుకూలంగా లెటర్లు రాస్తుండేవారు. దీంతో ముద్రగడ వైసీపీ మనిషనే ముద్ర పడటమే కాకుండా..ఆయన వైసీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేసినా పెద్దగా ఒరిగిందేమీ లేదని సర్వేలు తేల్చి చెప్పేయడంతో.. జగన్ ఆ పెద్దాయనను లైట్ తీసుకున్నారు .
దీంతో ముద్రగడలో తీవ్ర అసహనం ప్రారంభమైంది. సరిగ్గా ఇలాంటి సమయములోనే జనసేన నేతలు ముద్రగడను కలిసి..జనసేనలోకి ఆహ్వానించారు. కానీ నెలలు గడుస్తున్న పవన్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో బాగా హర్ట్ అయిన ముద్రగడ పవన్ ను టార్గెట్ చేస్తూ లేఖలు రాయడం మొదలు పెట్టారు.దీంతో ఈసారి వైసీపీ నేతలు ఆయన అప్రోచ్ అయి.. పార్టీలోకి ఆహ్వానించడంతో ముద్రగడ మెత్తబడ్డారట.ఇంకా చెప్పాలంటే.. వేరే దారి లేకపోవడంతో వైసీపీకి బే షరతుగా మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ నుంచి ఎమ్మెల్యే సీటు గానీ, ఎంపీ సీటు గాని హమీ లేకుండా కేవలం.. వైసీపీకి సేవ చేయడానికే ముద్రగడ ఆ పార్టీలోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హరి రామ జోగయ్య కొడుకు వైసీపీలో చేరగా.. ఇప్పుడు ముద్రగడ కుటుంబం రెడీ అయింది. టికెట్లు ఇవ్వకుండా కేవలం పవన్‌ను రెచ్చగొట్టడానికే వీరిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా తన కొడుకుకు రాజకీయ జీవితం ఇవ్వాలనుకున్న ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ అణచివేసినట్లే అయింది.అయినా కూడా పవన్ మీద పంతంతో వైసీపీలోకి వెళ్లి బేషరతుగా మద్దతు తెలపాల్సిన పరిస్థితికి చేరుకున్నారన్న వాదన వినిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE