2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అంతకు ముందు 2023లో జరిగిన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనూహ్యమైన ఫలితాలతో ఇటు కేసీఆర్‌కు, అటు జగన్‌కు ఘోర ఓటమిని అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి రాజకీయ విశ్లేషకులు సైతం ఊహించని పరాజయాన్ని అందించారు ఏపీ ఓటర్లు. ఎందుకంటే 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన వైఎస్సార్సీపీని.. ఈ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితిని కల్పించారు. 175 స్థానాలలో పోటీ చేస్తే.. వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయాన్ని సాధించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇలా అధికారంలో ఉన్న పార్టీ ఇంత దారుణమైన పరాభవాన్ని ఎదుర్కోవడం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీ లోనే మొదటిసారి జరిగింది. మరోవైపు తెలంగాణలోని ఇదే జరిగింది. ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. తిరుగులేని పార్టీగా ప్రస్తానాన్ని కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేసిన తెలంగాణ ప్రజలు.. బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షానికి మాత్రమే పరిమితం చేశారు.కేవలం 39 స్థానాలలో మాత్రమే గులాబీ పార్టీని గెలిపించారు.
అధికారంలో ఉన్నప్పుడు,ఇప్పుడు కూడా మంచి స్నేహబంధాన్ని కొనసాగించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త రౌండ్లు కొడుతుంది. ఓడిపోయిన ఇద్దరు మాజీ సీఎంలలో సీఎం కేసీఆర్ మాత్రం జగన్ కంటే గ్రేట్ అని అంటున్నారు. ఎందుకంటే 175 స్థానాలలో వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. కానీ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడినా కూడా 39 స్థానాల్లో విజయం సాధించి బలమైన ప్రతిపక్ష హోదాని దక్కించుకుంది. అది కూడా ఏపీలో 175 స్థానాల్లో 11 స్థానాలను వైసీపీ దక్కించుకుంటే తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలలో 39 స్థానాలను గెలుచుకోగలిగింది బీఆర్ఎస్. దీంతో.. ఓటమిపాలైనప్పటికీ జగన్ కంటే కేసీఆర్ ఎంతో గ్రేట్ అంటూ నెట్టింట్లో వార్తలు షికార్లు కొడుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE