ఏపీలో ఊపందుకుంటోన్న సినిమా రాజకీయాలు

A counter-strategy, strategy , Film politics in AP,CM Jagan, Nara Lokesh, RGV, Natti Kumar
A counter-strategy, strategy , Film politics in AP,CM Jagan, Nara Lokesh, RGV, Natti Kumar

ఆంధ్రప్రదేశ్  పాలిటిక్స్ ఇప్పుడు సినిమాల కేంద్రంగా తిరుగుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి సినిమాలు తీసిన  రామ్ గోపాల్ వర్మ..తాజాగా వ్యూహం సినిమా తీసిన  సంగతి తెలిసిందే.  సీఎం  జగన్ జీవిత చరిత్ర ఆధారంగా వ్యూహం సినిమాను తెరకెక్కించినట్లు వర్మ చెబుతున్నా.. దీనిలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కోర్టు ఈ  సినిమా రిలీజ్‌ను వాయిదా వేసింది.

ఇలాంటి సమయంలోనే  తాను వైసీపీకి వ్యతిరేకంగా.. టీడీపీకి అనుబంధంగా సినిమా తీస్తానని  సినీ నిర్మాత నట్టి కుమార్ కామెంట్లు చేయడం.. సినీ అండ్ పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది.  ఏపీలో రియల్ రాజకీయాన్ని రీల్స్‌లో చూపించబోతున్నారనే చర్చ ఏపీ వ్యాప్తంగా మెుదలైంది. పైగా.. నారా లోకేశ్ కూడా వ్యూహంకు ప్రతివ్యూహం ఉండదా అని లోకేశ్ వ్యాఖ్యలు చేయడంతో  వైసీపీకి వ్యతిరేకంగా నారా లోకేశ్ నట్టి కుమార్‌తో  సినిమా తీయిస్తున్నారా అన్న చర్చ షురూ అయింది.

సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటేనే  అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలనే అంశాలపై రాజకీయ పార్టీలు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుంటాయి. కానీ  ఏపీలో దీనికి భిన్నంగా రియల్ పాలిటిక్స్‌ను రీల్స్‌లో చూపించడానికే ప్రధాన  పార్టీలు పోటీపడుతున్నాయి. అటు వైసీపీకి అనుకూలంగా ఆర్జీవీ వ్యూహం, శపథం సినిమాలు తీస్తున్నారు. నిర్మాతగా దాసరి కిరణ్ కుమార్ వ్యవహరిస్తున్న  ఈ సినిమా రెండు పార్టులలో ఒక పార్ట్‌గా వ్యూహం సినిమా విడుదలకు సిద్ధం అయినా హైకోర్టు ఆదేశాలతో విడుదల కోసం వేచి ఉంది.

దీనిపై ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలపై బురద చల్లడం, సినిమాలు తీయడం కొందరికి అలవాటుగా మారిందని నారా లోకేష్ సీఎం జగన్‌కు చురకలు అంటించారు. వ్యూహం సినిమా బడ్జెట్ అంతా జగన్ దేనని, ఆర్జీవీ తరచూ జగన్‌ను కలుస్తున్నారని అన్నారు. వర్మ తరపున వాదిస్తున్న లాయర్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు అని.. ఆయన తెలంగాణా హైకోర్టులో కేసు వాదిస్తున్నాడరంటే  అర్థం ఏమిటని ప్రశ్నించారు. తాము సినిమా తీయాలంటే.. హు కిల్డ్ బాబాయ్, కోడికత్తి, ప్యాలెస్ కుట్రలపై తీయొచ్చని సెటైర్ వేశారు.

ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా తాను కూడా సినిమా తీస్తానని ఇప్పటికే నిర్మాత నట్టికుమార్ ప్రకటించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఎంపీ రఘురామ కృష్ణంరాజునను కస్టడీలో చిత్రహింసలకు గురి చేయడం, జగన్  పాలనలో అరాచకాలను ఆ సినిమాలో చూపిస్తానని  అన్నారు. దీంతో ఏపీ రాజకీయాలు సినిమాల చుట్టూనే తిరుగుతున్నాయని చర్చ షురూ అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE