ఏపీకి మూడు రాజధానులను కడుతామని గత వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఆ మూడు రాజధానుల అంశమే ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అయింది. మూడు రాజధానులు కడుతామని వైసీపీ ప్రచారం చేసినప్పటికీ అయిదేళ్లలో ఆ దిశగా అడుగులు వేయలేదు. అసలు మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఏపీ ప్రజలకు నచ్చలేదు. మూడు రాజధానుల అంశంతో పాటు.. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న పలు నిర్ణయాలే వైసీపీకి ఓటమికి కారణమయ్యాయి.
అయితే ఏపీలో ఫలితాలు వెలువడి నెలరోజులు కూడా కాలేదు. అప్పుడే వైసీపీ నేతలు మరోసారి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ మూడు రాజధానుల అంశాన్ని మాత్రం విడవడం లేదు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి మూడు రాజధానుల అంశంపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
తమ ఓటమికి కారణాలేంటి.. ప్రజలు ఎందుకు తమను తిరస్కరించారనే అంశాలపై వైసీపీ నేతలు అధ్యయనం చేయాల్సిన సమయం ఇది. కానీ అందుకు భిన్నంగా బొత్స సత్యనారాయన స్పందించారు. అంతేకాకుండా ప్రజలు దేనివల్ల అయితే తిరస్కరించారో.. అదే అంశంపై బొత్స సత్యనారాయణ మాట్లాడడం సంచలనంగా మారింది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాము ఇప్పటికీ మూడు రాజధానులకు కట్టబడి ఉన్నామని.. అదే తమ పార్టీ విధానమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతికి తాము వ్యతిరేకమన్న విషయాన్ని బొత్స చెప్పకనే చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ