వైఎస్ వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు, ఈనెల 22న విచారణకు రావాలని ఆదేశాలు

YS Viveka Assassination Case CBI Once Again Issues Notices To MP Avinash Reddy To Attend For The Enquiry on May 22nd,YS Viveka Assassination Case,CBI Once Again Issues Notices To MP Avinash Reddy,MP Avinash Reddy To Attend For The Enquiry,MP Avinash Reddy Enquiry on May 22nd,Mango News,Mango News Telugu,Viveka murder case,CBI serves fresh notices,YS Viveka Assassination Case Latest News,YS Viveka Assassination Case Latest Updates,YS Viveka Assassination Case Live News,MP Avinash Reddy Latest News,MP Avinash Reddy Latest Updates,MP Avinash Reddy Live News

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న (సోమవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయం ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. కాగా ఇప్పటికే ఆయన రెండు పర్యాయాలు సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. తాజాగా ఈ నెల 19న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు తమ ఎదుట ఎట్టిపరిస్థితుల్లోనూ హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చినప్పటికీ ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరైన విషయం తెలిసిందే. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని పేర్కొంటూ నిన్నటి విచారణకు ఆయన హాజరుకాలేదు. దీంతో సీబీఐ అధికారులు ఎంపీకి మరోమారు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన వాట్సాప్ నంబర్‌కు నోటీసులు పంపించినట్లు సీబీఐ వర్గాలు ధృవీకరించాయి. దీంతో ఆ రోజైనా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవుతారా? లేదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 1 =