ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీంతో మధ్యాహ్నం 12:30 గంటల వరకు 66.60 % పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 13 జిల్లాల్లోని 2743 పంచాయతీలు, ఆయా పంచాయతీల పరిధిలో 22,423 వార్డులకు ఎన్నికల నిర్వహణ కోసం 28,995 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఇక కరోనా బాధితులు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు, ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు.
ముందుగా నాలుగో విడతకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 3299 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల అవగా 554 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే రెండు పంచాయతీల్లో నామినేషన్స్ దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో మిగిలిన 2,743 పంచాయతీల్లో నేడు పోలింగ్ జరగుతుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియను ప్రారంభించనున్నారు. ఫలితాల అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ