మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రాజకీయాల్లో సక్సెస్ ఫుల్ హామీ.. ఈ హామీ పార్టీల గెలుపులో కీలక భూమిక పోషిస్తోంది. ఈ హామీని ఇచ్చిన అన్ని పార్టీలు ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాయి. కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ హామీ గుప్పించింది. ఉచిత బస్సు ప్రయాణం హామీ మహిళలను విపరీతంగా ఆకట్టుకుంది. ఫలితంగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని చేర్చింది. ఇక్కడ కూడా ఈ హామీని ఇచ్చి కాంగ్రెస్ సూపర్ సక్సెస్ అయింది.
ఈక్రమంలో ఏపీలో తెలుగు దేశం పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల ముంగిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఇచ్చింది. సూపర్ సిక్స్‌లో దీనిని కూడా చేర్చింది. ఇప్పుడు ఏపీలో తెలుగు దేశం కూటమి అఖండ విజయం సాధించింది. దీంతో తమ గెలుపులో కీలక పాత్ర పోషించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందట. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు కూడా మొదలు పెట్టిందట. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సాధ్యాసాధ్యాలపై వివరణ ఇవ్వాలని, ప్రభుత్వంపై ఏమేరకు భారం పడుతుందో తెలపాలని ఆర్టీసీ ఎండీని కోరారట.
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటకలో ఈ హామీ అమలులో ఉంది. ఈక్రమంలో ఆయా రాష్ట్రాల్లోని ఆర్టీసీ అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారట. పథకం అమలు వల్ల ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుంది.. అదనపు భారం ఎంత పడుతుంది అనే అంశాల గురించి చర్చిస్తున్నారట. అలాగే ఈ హామీని పల్లె వెలుగు బస్సులకు మాత్రమే పరిమితం చేయాలా లేదా రాష్ట్రం మొత్తం అమలు చేయాలా అనే దానిపై కూడా చర్చలు జరుపుతున్నారట. మరో రెండు, మూడు నెలల్లో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లోకి తీసుకురానున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY