దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు

Free Gas Cylinders From Diwali, Free Gas Cylinders, Free Gas Scheme, Free Cooking Gas Cylinders, CM Chandrababu, Jana Sena, Minister Nadendla Manohar, TDP, Who This Scheme Applies To, AP Free Gas Scheme Started From Diwali, CM Chandrababu, Andhra Pradesh, AP Live Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

పీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీ అమలుకు నిర్ణయించింది.దీనిలో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు మార్గదర్శకాలను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ భేటీలో ఏటా మూడు సిలిండర్ల అందించేలా క్యాలెండర్ నిర్ణయించింది.

ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్‌లో భాగంగా.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అక్టోబర్ 31 దీపావళి నుంచి అమలు కాబోతోంది. ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వనున్న ఈ పథకం కోసం.. ఏపీ ప్రభుత్వంపై ఏటా సుమారుగా 2,684 కోట్ల రూపాయల మేర భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు కానుంది. ఈ పథకం అమలు కావడం కోసం అక్టోబర్ 27 లేదా 28వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభించబోతున్నారు.

గ్యాస్ కనెక్షన్ ఉండి.. తెల్గ రేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ఈ పథకం అమలు అవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పు కొచ్చారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని..ప్రతీ 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఇచ్చేలా షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్య మొదటి సిలిండర్ అలాగే ఆగష్టు నుంచి నవంబర్ మధ్య రెండో సిలిండర్, డిసెంబర్ నుంచి మార్చి 31 మధ్య మూడో సిలిండర్‌ను ఇవ్వనున్నట్టు మంత్రి వెల్లడించారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ అమౌంట్‌ను 48 గంటల్లోనే తిరిగి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

కాగా తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో..ఉచిత గ్యాస్ పథకం అమల్లో భాగంగా.. ప్రజల్లోకి తీసుకెళ్లటంపైన చర్చ జరిగింది. ఫించన్లు ఇంటింటికీ వెళ్లి ఇస్తున్నట్లే ..సిలిండర్లను కూడా అందిస్తే బాగుంటుందనే ప్రతిపాదన వచ్చింది. లబ్దిదారుని బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయడం కంటే ఇంటికి వెళ్లి ఇస్తే ఎక్కువ ప్రభావం ఉండొచ్చని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. అయితే, తనకు కూడా అలాంటి ఆలోచనే ఉందని .. కాకపోతే.. అయిదు రాష్ట్రాలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాయని..ప్రస్తుతానికి మనం కూడా అదే విధానం అమలు చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.అయితే గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకం అమలయిన తరువాత అవసరమైన మార్పులు చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.