టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరు

Gannavaram Incident: Bail Granted for TDP Leader Kommareddy Pattabhi and other 13 People

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ కు బెయిల్‌ మంజూరైంది. గన్నవరం ఘటన కేసులో ఇటీవలే అరెస్టైన పట్టాభితో పాటు మరో 13 మంది టీడీపీ నేతలకు సివిల్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల పాటుగా రిమాండ్ విధించడంతో పోలీసులు వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, విచారణ అనంతరం పట్టాభి సహా 13 మంది టీడీపీ నేతలను బెయిల్ పై విడుదల చేయాలని విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. కాగా 3 నెలల పాటు ప్రతి గురువారం పోలీసుస్టేషన్‌లో హాజరు కావాలని బెయిల్‌ షరతుల్లో పేర్కొన్నారు.

ముందుగా ఇటీవల గన్నవరంలో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభి సహా 13 మందిపై పోలీసులు హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్టు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఈ కేసులో పోలీసులు ఎ1 గా పట్టాభిని, ఎ2 గా చిన్నాను చేర్చారు. ఈ క్రమంలోనే వారిని రిమాండ్ కు తరలించగా, తాజాగా వారికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE