రిటైర్మెంట్కు ఒక్కరోజు ముందు ఏబీకి గుడ్ న్యూస్

What Is The Secret Of Kamakhya Devi Temple?, Secret Of Kamakhya Devi Temple, Secret Of Kamakhya,Kamakhya Devi Temple, Lord Shiva, Lord Shiva'S Wife Sati, Nelachal Mountain In Assam, The Secret Of Kamakhya Devi Temple, Unexplored Facts About Kamakhya Temple,Mystical Secrets Of Kamakhya Temple,Supernatural Secrets,History Of Kamakhya Temple,Mystery Of Kamakhya Temple,Mango News,Mango News Telugu,
AB Venkateswara Rao, Good news for AB Venkateswara Rao , one day before retirement,AP High Court , suspension

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు  రిటైర్మెంట్కు ఒక్కరోజు ముందు ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్ వినిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో  తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన  ఏబీ వెంకటేశ్వరరావు‌పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది.

ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయడం చెల్లదంటూ ..కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ ఉత్తర్వుల్ని ఏపీ హైకోర్ట్ సమర్దించింది. దీంతో రెండోసారి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయడం చెల్లదంటూ తీర్పును వెల్లడించింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు కేసు తీర్పు ఎలా ఉంటుందా అని ఆందోళన పడిన వారి కుటుంబ సభ్యులకు  ఊరట కల్పించినట్లు అయింది. ఇటు సరిగ్గా రిటైర్మెంట్‌కు ఒక్కరోజు ముందు ఏబీ వెంకటేశ్వరరావుకు గుడ్ న్యూస్ వినిపించడం నిజంగానే ఆయనకు గ్రేట్ న్యూస్ అవుతుందని చర్చ ఏపీ వ్యాప్తంగా సాగుతోంది.

గతంలో ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్ ఎత్తేస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో తనకు పెండింగ్ ఉన్న జీత భత్యాలు, పోస్టింగ్ కోసం ఏబీ వెంకటేశ్వరరావు ఎదురు చూస్తున్న సమయంలోనే.. ఆయనపై రెండోసారి ఏపీ సర్కార్ సస్పెన్షన్ వేటు వేసి షాక్ ఇచ్చింది.అయితే దీన్ని క్యాట్ తోసిపుచ్చింది.

ఇప్పుడు క్యాట్ ఉత్తర్వుల్ని ఏపీ హైకోర్టు కూడా సమర్థించి ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. దీంతో జూన్ 1న రిటైర్ అవుతున్న ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట దొరికినట్లు అయింది. సస్పెన్షన్ ఎత్తివేయడంతో.. ఆయనకు దక్కాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ ఆయనకు ఇప్పుడు దొరకనున్నాయి.

కాగా, ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ ప్రింటింగ్, స్టేషనరీ డీజీగాఏబీ వెంకటేశ్వరరావుకు బాధ్యతలను అప్పగించింది. ఇవాళ సాయంత్రమే  ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్ అవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY