కొత్త పథకంతో దాదాపు లక్ష రూపాయల వరకు లబ్ది

Good News For AP Farmers,Good News, AP Farmers,AP, AP CM Chandrababu,TDP, The Benefit Is Up To One Lakh Rupees, With The New Scheme, YS Jagan,Jana Sena,Pawan Kalyan,AP election results , Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, AP Politics, Political News, Mango News, Mango News Telugu
Good news for AP farmers, With the new scheme, the benefit is up to one lakh rupees, AP CM Chandrababu,YS Jagan, TDP,

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత..రకరకాల పథకాలను తీసుకువస్తోంది.ఏపీ ప్రజలకు న్యాయం చేసేలా  కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే  ఏపీలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటనలు చేస్తూ వస్తోంది.తాజాగా ఏపీలో ఉన్న రైతులకు  వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అదిరిపోయే శుభవార్త అందించారు. పాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా తెలిపారు.

ముఖ్యంగా పాల దిగుబడి పెంచే దిశగా… చర్యలు తీసుకోవడానికి ఊరూర పశుగ్రాస క్షేత్రాలు అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని తాము ఆదేశించినట్లు మంత్రి అచ్చెం నాయుడు  స్పష్టం చేశారు . అయితే గతంలో కూడా తాము ఈ పథకాన్ని అమలు చేశామని.. కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని మొత్తం ఆపేసారని ఆరోపించారు

ఏపీలో ఈ పశుగ్రాసం పెంపకంలో భాగంగా… చిన్న అలాగే సన్న కారు రైతులకు ఉపయోగపడేలా ఈ పథకం ఉంటుందని అచ్చెన్నాయుడు  అన్నారు. వారి పొలంలో కనీసం 25 గుంటల నుంచి మూడు ఎకరాల వరకు పశుగ్రాసాన్ని పెంచేలా తాము ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన వివరించారు. అంతేకాకుండా రెండు సంవత్సరాల పాటు ఒక ఎకరానికి… దాదాపు లక్ష రూపాయల వరకు సహాయం కూడా అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రైతులకు మేలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ