ఏపీలో కొత్తగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఓటాన్ అకౌంట్ వైపు మొగ్గు చూపింది. ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టకుండానే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. అయితే బుధవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్ మంజూరు చేయగా.. బుధవారం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దానికి ఆమోదం తెలిపారు. రూ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు కూడా కాకపోవడంతో.. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొంత సమయం అవసరమని గెజిట్‌లో గవర్నర్ వెల్లడించారు. ఆర్థిక శాఖ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉన్నందున మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు నాలుగు నెలల కాప పరిమితితో రూ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. మొత్తం 40 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన డిమాండ్లతో కూడిన బడ్జెట్ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు.
అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా పలు అత్యవసర విభాగాలకు ప్రభత్వం బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకు రూ. 1100 కోట్లు మేర కేటాయించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆగష్టు 15 నుంచి తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబధించి కూడా బడ్జెట్‌లో నిధులను కేటాయించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ