అక్రమకట్టడాల కూల్చివేతపై చంద్రబాబు,జగన్ మధ్య మాటల యుద్ధం

Andhra Pradesh Political News, Chandrababu satire on YS Jagan on illegal constructions, Dialogue war between TDP & YCP over illegal constructions, Dialogue war Between YCP And TDP Over Illegal Constructions, Mango News, War Of Words Between Chandrababu And Jagan Over Illegal Constructions, YS Jagan Counter to Chandrababu over Illegal Constructions

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో అక్రమ కట్టడాలపై చర్చ జరిగింది, ప్రజావేదిక కూల్చివేత మరియు ప్రస్తుతం ఉంటున్న నివాసం పై వస్తున్నా అభియోగాలపై చంద్రబాబు మాట్లాడారు . ప్రస్తుతం నివాసముంటున్న ఇల్లు తనది కాదని, లింగమనేని రమేష్ అనే వ్యక్తి దగ్గర అద్దెకు తీసుకున్నానని, భవనాలు కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయం పై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, రాష్ట్రంలో ఇతర అక్రమ కట్టడాలు, రోడ్లపై అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాల తొలగింపు పై ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ డిమాండ్ చేశారు.

విగ్రహలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది, తదనంతరం చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ విగ్రహాలపై స్పందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందని, మంచి మిత్రులమని,తామిద్దరం ఒకే గదిలో నిద్రించిన సందర్భాలు కూడ ఉన్నాయని చెప్పారు. తమ మధ్య రాజకీయ వైరుధ్యం తప్ప ఎటువంటి వ్యక్తిగత గొడవలు లేవని, వైఎస్ఆర్ విగ్రహాల పట్ల తనకేమి ఇబ్బంది లేదని,కూల్చివేయాలని డిమాండ్ చేయడం లేదని ప్రకటించారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ స్పందిస్తూ చట్టాలను అతిక్రమిస్తూ కట్టిన భవనాలు కూల్చివేతపై చర్చ ఎందుకని, ప్రజావేదిక ని కూల్చివేసినట్టే ఇతర అక్రమ కట్టడాలపై కూడ చర్యలు తీసుకుంటామని చెప్పారు. నీటి ప్రవాహానికి అడ్డుగా భవనాలు నిర్మిస్తే, ప్రవాహం మరో మార్గంలో వచ్చి ఇతర ఇళ్లులు మునిగిపోయే అవకాశం ఉందని చెప్పారు, చంద్రబాబు ఉంటున్న నివాసం పక్కనే ప్రజావేదికను నిర్మించారని, నది ని ఆనుకోని భవనాలు నిర్మించాలంటే అనుమతులు అవసరం అని, టిడిపి నాయకులు కూల్చివేతలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.

 

[subscribe]
[youtube_video videoid=ViGrzJucVOI]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 7 =