కేంద్రం కీలక నిర్ణయం.. ఏపీ లోని కొవ్వాడలో 1,208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్ల నిర్మాణానికి ఆమోదం

Centre has given in-principle approval for setting up six reactors of 1208 MW each at Kovvada nuclear power plant, AP Centre Gives Nod To Set up Six Reactors Capacity of 1208 MW at Kovvada Nuclear Plant, Centre Gives Nod To Set up Six Reactors Capacity of 1208 MW at Kovvada Nuclear Plant, Nod To Set up Six Reactors Capacity of 1208 MW at Kovvada Nuclear Plant, Six Reactors Capacity of 1208 MW at Kovvada Nuclear Plant, six reactors of 1208 MW each at Kovvada nuclear power plant, Kovvada nuclear power plant, 1208 MW nuclear power plant with a total capacity of six reactors would be set up, 6 nuclear reactors in AP, Kovvada Nuclear Plant To Set up Six Reactors Capacity of 1208 MW, Kovvada nuclear power plant News, Kovvada nuclear power plant Latest News, Kovvada nuclear power plant Latest Updates, Kovvada nuclear power plant Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంలో ఒక్కొక్కటి 1,208 మెగావాట్ల ఆరు రియాక్టర్ల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభలో గురువారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జితేంద్ర సింగ్‌ సమాధానమిచ్చారు. కొవ్వాడతో పాటు మహారాష్ట్రలోని జైత్‌పూర్, గుజరాత్‌లోని ఛాయ, మిథి విర్ది, పశ్చిమబెంగాల్‌లోని హరిపూర్, మధ్యప్రదేశ్‌లోని భీమ్‌పూర్‌లలో కూడా అణువిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. అయితే ప్రభుత్వం ఆర్థిక అనుమతిని ఖరారు చేసిన తర్వాత ఖర్చు మరియు పెట్టుబడి వివరాలు వెలువడతాయని మంత్రి చెప్పారు.

కాగా కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టులో మొత్తం అంచనా పెట్టుబడులు సుమారు రెండు లక్షల కోట్ల వరకు ఉండొచ్చని మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోందని మంత్రి తెలిపారు. ఇక ఉపాధి విషయానికొస్తే, పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ సిబ్బంది అవసరం మరియు నిర్మాణ సమయంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మంత్రి వివరించారు. అలాగే నిర్మాణ సమయంలో గరిష్టంగా దాదాపు 8,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పని ప్రారంభించిన తర్వాత ప్రతి జంట యూనిట్ స్టేషన్లు దాదాపు 2,000 మందికి ఉపాధిని (ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా) సృష్టించగలవని భావిస్తున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 22 ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఉన్నాయని, 4,600 మెగావాట్ల సామర్థ్యంతో 11 న్యూక్లియర్ పవర్ రియాక్టర్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి తెలిపారు. అలాగే మొత్తం 7,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10 రియాక్టర్లను ఫ్లీట్ మోడ్‌లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మరియు పాలనాపరమైన ఆమోదం ఇచ్చినట్లు తెలిపారు. ఈ పది రియాక్టర్ల నిర్మాణం 2031 నాటికి పూర్తవుతుందని, తద్వారా అదనంగా మరో ఏడువేల మెగావాట్ల అణువిద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 13 =