మరో సారి అభ్యర్థులను తికమకపెడుతున్న జగన్

Jana Sena, TDP, Congress, YCP, CM Jagan,Guntur YCP MP candidate change?,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, Andhra Pradesh, AP,Mango News Telugu, Mango News
Jana Sena, TDP, Congress, YCP, CM Jagan,,Guntur YCP MP candidate change?,

వైసీపీలో ఇన్చార్జ్‌ల నియామకాలు వైసీపీ అధినేత జగన్ కన్ఫ్యూజన్లో తీసుకుంటున్న నిర్ణయమో..లేక   లేకపోతే వ్యూహాత్మకంగా గందరగోళం సృష్టించుకుంటున్నారో అనేదానిపై  క్లారిటీ లేకుండా పోయింది.ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలక అభ్యర్థులకు ప్రకటించాక ఆ ఆనందాన్ని పంచుకోవాలో లేక ఎప్పుడు మార్చేస్తారో అంటూ టెన్షన్ పడాలో తెలియని పరిస్థితి వారిలో నెలకొందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే తాజాగా ఏపీ సీఎం జగన్ గుంటూరు లోక్ సభ అభ్యర్ధిల పేర్లలో ఇద్దరు ముగ్గుర్ని పరిశీలించిన తర్వాత చివరికి గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా  కిలారి రోశయ్యను ఖరారు చేశారు. అయితే జగన్  ఆలోచన తెలిసిన వ్యక్తి కావడంతో రోశయ్య కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగలేదు. ఆయా నియోజకవర్గాల ఇన్చార్జ్‌లతో  పూర్తిగా కనెక్ట్ కావడంలేదు. దీంతో రోశయ్య  కొనసాగుతారా మార్పులుంటాయా అనే చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.

చివరకు ప్రచారంలో డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా  రోశయ్య వెనుకడుగు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగన్ అభ్యర్ధులను ప్రకటించినా కూడా చాలా నియోజకవర్గాలపై అస్పష్టత కొనసాగుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు కొనసాగుతారా? లేక అతనిని తప్పించి మరొకరికి అవకాశం ఇస్తారా? అనే క్లారిటీ ఇంకా రాలేదు.

ఎందుకంటే మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డికి సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం ఇస్తారని అంటున్నారు.దీంతో అంబటి రాంబాబును గుంటూరు ఎంపీగా నిలబెడతారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి కన్ఫ్యూజన్ల మధ్య పార్టీ నేతలు ఉండగా..గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సీటు ఆశించిన మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడును.. మూడు నెలల తరువాత చిలకలూరిపేటకు మార్చడంపై  వైసీసీ నాయకులు విస్తుపోతున్నారు. ఏ ఎన్నికలలో అయినా సరే ఏ పార్టీ  కూడా జగన్ చేసినన్ని మార్పులు చేయలేదని స్వయానా వైసీపీ నాయకులే మండిపడుతున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE