జనసేనాని లిస్టులో ఏ నియోజకవర్గాలున్నాయి?

constituencies, Jana Sena's list, Jana Sena, Pawan Kalyan, TDP, Congress, Chandrababu, Lokesh, YCP, CM Jagan, BJP, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
constituencies, Jana Sena's list, Jana Sena, Pawan Kalyan, TDP, Congress, Chandrababu, lokesh, YCP, CM Jagan, BJP

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పాటు..మరో రెండు, మూడు రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై పూర్తిగా ఫోకస్‌ పెట్టాయి. ఇటు టీడీపీ, జనసేన,బీజేపీ కూటమి మధ్య పొత్తులపై సందిగ్ధత తొలగిపోవడం మూడు పార్టీల నేతలు కూడా ఇదే పనిలో బిజీ అయ్యారు.

కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేదానిపై  క్లారిటీ రావడంతో..ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా పార్టీ అగ్రనేతలతో కలిసి అభ్యర్థుల ఎంపికపై తమ కసరత్తును ముమ్మరం చేశారు. మరోవైపు పోటీ చేసే అభ్యర్థులకు కూడా క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా మరో ఐదు నియోజకవర్గాలపై జనసేనాని క్లారిటీ ఇచ్చారు.

భీమవరం, నరసాపురం, తాడేపల్లి గూడెం, రాజోలు, ఉంగుటూరు, స్థానాల అభ్యర్థులపై పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ .. తాజాగా మరో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలపై క్లారిటీ ఇవ్వడంతో.. మొత్తం జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 11 స్థానాలపై నిర్ణయానికి వచ్చినట్టు అయ్యింది..

పవన్‌  క్లారిటీ ఇచ్చిన ఆ ఐదు నియోజకవర్గాలలో పోటీ చేయనున్న అభ్యర్థుల విషయానికి వస్తే.. భీమవరం నుంచి రామాంజనేయులు, రాజోలు నుంచి వర ప్రసాద్, నరసాపురం  నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి ధర్మరాజు, తాడేపల్లి గూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అయితే భీమవరం బరిలో రామాంజనేయులు నిలబడతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఇప్పటికే ఈ సమాచారాన్ని ఆయా అభ్యర్థులకు జనసేన అధిష్టానం చేరవేసినట్లు తెలుస్తోంది. ఎలా అయినా ఈ ఎన్నికలలో విజయాన్ని సాధించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని.. ప్రచారాన్ని ముమ్మరం  చేసుకోవాలని వారందరికీ పవన్  సూచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 2 =