మరో 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

TDP Announced Candidates For Another 34 Seats, TDP Announced Candidates, TDP Announced 34 Seats, Ap State, Assembly Elections, TDP, Janasena, Chandrababu Naidu, Pawan Kalyan, CM Jagan, Second List, Mango News, Mango News Telugu
Ap State , Assembly elections , TDP , Janasena , Chandrababu Naidu ,Pawan Kalyan , CM Jagan , Second list

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగు దేశం పార్టీ స్పీడ్ పెంచేసింది. ఈసారి గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఈసారి పొత్తు పెట్టుకొని టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు ఎన్నికలకు వెళ్తున్నాయి. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను చంద్రబాబు జనసేనకు కేటాయించారు. అలాగే బీజేపీకి 10 అసెంబ్లీ, ఆరు లోక్ సభ స్థానాలను ఇచ్చారు. మిగిలిన స్థానాల్లో తెలుగు దేశం పార్టీ బరిలోకి దిగుతోంది.

ఇప్పటికే చంద్రబాబు నాయుడు మొదటి విడతలో 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా రెండో జాబితాను కూడా చంద్రబాబు ప్రకటించారు. ఈ జాబితాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రెండు జాబితాల్లో కలిపి ఇప్పుటి వరకు 128 అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఇంకా 16 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఆ స్థానాలకు కూడా అతి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

టీడీపీ అభ్యర్థులు వీరే..

ప్రత్తిపాడు-వరుపుల సత్యప్రభ

రంపచోడవరం-మిర్యాల శిరీష

గుంటూరు వెస్ట్‌ – పిడుగురాళ్ల మాధవి

గాజువాక – పల్లా శ్రీనివాసరావు

నరసన్నపేట – బగ్గు రమణ మూర్తి

చోడవరం – కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు

మాడుగుల – పైలా ప్రసాద్‌

రామచంద్రాపురం – వాసంశెట్టి సుభాష్‌

రాజమండ్రి రూరల్‌ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి

కొవ్వూరు – ముప్పిడి వెంకటేశ్వరరావు

మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి

దెందులూరు – చింతమనేని ప్రభాకర్‌

గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు

పెదకూరపాడు – భాష్యం ప్రవీణ్‌

గుంటూరు ఈస్ట్‌ – మహ్మద్‌ నజీర్‌

గురజాల – యరపతినేని శ్రీనివాసరావు

కందుకూరు – ఇంటూరి నాగేశ్వరరావు

మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి

గిద్దలూరు – అశోక్‌ రెడ్డి

ప్రొద్దుటూరు – వరదారాజుల రెడ్డి

ఆత్మకూరు – ఆనం రాంనారాయణ రెడ్డి

కోవూరు – వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

వెంకటగిరి – కరుగొండ్ల లక్ష్మీప్రియ

కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి

నందికొట్కూరు – గిత్తా జయసూర్య

ఎమ్మిగనూరు – జయనాగేశ్వర రెడ్డి

పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి

కదిరి- కందికుంట యశోదా దేవి

పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళి మోహన్

శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి

సత్యవేడు- కోనేటి ఆదిమూలం

మదనపల్లి- షాజహాన్ బాషా

చంద్రగిరి- పులివర్తి వెంకట మణి ప్రసాద్

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 13 =