భక్తుల అధిక రద్దీదృష్ట్యా తిరుమ‌ల యాత్ర వాయిదా వేసుకోండి, వృద్ధులు, చిన్నపిల్ల‌ల త‌ల్లిదండ్రులకు టీటీడీ విజ్ఞప్తి

TTD has Appealed Aged Infants and Differently Abled Persons To Postpone Their Tirumala Pilgrimage, TTD has Appealed Infants To Postpone Their Tirumala Pilgrimage, TTD has Appealed Aged Persons To Postpone Their Tirumala Pilgrimage, TTD has Appealed Differently Abled Persons To Postpone Their Tirumala Pilgrimage, Ahead of Independence Day TTD has Appealed Aged And Infants To Postpone Their Tirumala Pilgrimage, TTD has Appealed To Postpone Tirumala Pilgrimage, Tirumala Pilgrimage, Tirumala Tirupati Devasthanam, TTD has appealed to senior citizens, Differently Abled Persons To Postpone Their Tirumala Pilgrimage, TTD News, TTD Latest News, TTD Latest Updates, TTD Live Updates, Mango News, Mango News Telugu,

భక్తుల అధిక రద్దీ దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్ల‌ల త‌ల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమ‌ల యాత్రను వాయిదా వేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీటీడీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 11వ తేదీ నుండి 15వ తేదీ వ‌ర‌కు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని టీటీడీ అంచనా వేస్తోందని, భ‌క్తులు ప్రణాళికబ‌ద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని తిరుమలకు రావాలని టీటీడీ కోరుతోందని తెలిపారు.

వేసవి రద్దీ తగ్గినప్పటికీ, వారాంతం రద్దీతో పాటు పండుగతో కూడా వ‌రుస సెలవులు ఆగస్టు 19 వరకు కొనసాగుతాయి. పైగా పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబర్ 18న‌ ప్రారంభమై అక్టోబర్ 17వ తేదీన ముగుస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో తిరుమ‌ల యాత్రికుల ర‌ద్ధీ అనూహ్యంగా పెరిగే అవ‌కాశం ఉంది. ఈ కార‌ణంగా వృద్ధులు, చిన్నపిల్ల‌ల త‌ల్లిదండ్రులు, వికలాంగులు తిరుమ‌లకు పెరటాసి మాసం అనంతరం రావలసిందిగా విజ్ఞ‌ప్తి చేస్తున్నామని టీటీడీ పేర్కొంది. అధిక రద్దీ ఉన్న రోజుల్లో యాత్రికులను వారి నిర్దేశిత సమయాలలో మాత్రమే దర్శనానికి అనుమతించడం జ‌రుగుతుందన్నారు. యాత్రికులు దర్శనం కోసం తమ వంతు వ‌చ్చే వరకు కంపార్ట్‌మెంట్లలో మరియు క్యూ లైన్లలో చాలా గంటలు వేచి ఉండటానికి సంసిద్ధత మరియు ఓపికతో రావాల‌ని టీటీడీ విజ్ఞ‌ప్తి చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 8 =