ఏపీలోని మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువలా వచ్చి పడుతున్నాయి.ఈరోజు సాయంత్రం వరకూ గడువు ఉండటతో ఇది మరింత పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందుగా మద్యం దుకాణాల కోసం లక్ష దరఖాస్తులు వస్తాయని, దీనివల్ల ప్రభుత్వానికి 2 వేల కోట్ల రూపాయల వరకూ ఆదాయం సమకూరుతుందని మొదట అంచనా వేశారు. ఊహించని స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ప్రభుత్వం గడువును పెంచింది.
అలాగే ఎక్సైజ్ శాఖ కూడా దరఖాస్తుదారులకు ఆన్‌లైన్‌లో ఎక్కువ వెసులుబాటును కల్పించింది. సమాచారం కోసం ఎక్సైజ్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మొత్తం వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టింది. దీంతో మంగళవారం నుంచి దరఖాస్తుల వెల్లువ మొదలైంది. దరఖాస్తుల గడువు మరో రెండు రోజులు పొడిగించడంతో గురు, శుక్రవారాల్లో ఇంకా దరఖాస్తులు పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
కాగా..ఏపీలో మద్యం షాపులకు విదేశాల నుంచి దరఖాస్తులు రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. యూరప్, అమెరికా నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు నమోదయ్యాయి. అమెరికా నుంచి ఏకంగా 20 అప్లికేషన్లు వచ్చినట్లు ఎక్సై అధికారులు తెలిపారు. మద్యం షాపుల టెండర్లకు సంబంధించి ఈ సాయంత్రం వరకే సమయం ఉండటంతో ఎక్కువ మంది దరఖాస్తులు వేస్తున్నారు. ఇప్పటివరకు 70వేలకు పైగా టెండర్లు వచ్చినట్లుగా ..సుమారు 1500 కోట్ల రూపాయలకుపైగా డిపాజిట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇంకా దరఖాస్తులకు కొద్ది సమయం ఉంది. 14వ తేదీన టెండర్లు ఓపెన్ చేస్తారు. మద్యం షాపుల టెండర్లకు సంబంధించి విదేశాల నుంచి కూడా అప్లికేషన్లు వచ్చాయి. ఒక్క అమెరికా నుంచే దాదాపుగా 20కి పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది. యూరప్ నుంచి కూడా పదుల సంఖ్యలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు వస్తున్నాయి. ఈరోజు రాత్రి వరకు ఈ అప్లికేషన్లు స్వీకరిస్తారు . అక్టోబర్ 14వ తేదీన టెండర్లు ఓపెన్ చేసి.. లాటరీ విధానం ద్వారా మద్యం షాపులను కేటాయిస్తారు.
అక్డోబర్ 16 నుంచి ఏపీలో కొత్త మద్యం షాపులు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఇకపై కొత్త షాపులు, కొత్త బ్రాండ్లు, కొత్త ధరలు, కొత్త మద్యం విధానం రాబోతోంది. మొత్తం మీద ప్రభుత్వం అనుకున్నదానికంటే కూడా ఎక్కువ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో షాప్ కి నాన్ రీఫండబుల్ అమౌంట్ 2లక్షలు రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.