కింజారపు ఫ్యామిలీ దశ తిరిగేనా?

Srikakulam, atchannaidu kinjarapu, Rammohannaidu kinjarapu, kinjarapu Family,Lok Sabha constituency,andhra pradesh, Nara Lokesh,MLA,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Srikakulam, atchannaidu kinjarapu, Rammohannaidu kinjarapu, kinjarapu Family

కింజారపు ఫ్యామిలీ కంచుకోట ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. నాలుగు దశాబ్దాలుగా శ్రీకాకుళంలో కింజారపు ఫ్యామిలీ హవా కొనసాగుతోంది. ముందు నుంచి కూడా కింజారపు ఫ్యామిలీ తెలుగు దేశం పార్టీకి మద్ధతుగా ఉంటోంది. జిల్లాలో పార్టీని గెలిపించడంలో కింజారపు ఫ్యామిలీ ముందుంటోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున కింజారపు ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు.. ఎంపీగా రామ్మోహన్ నాయుడు పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయినప్పటికీ.. వారు మాత్రం పార్టీని వీడలేదు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలొస్తుండడంతో.. మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు.

ప్రస్తుతం అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే బరిలోకి దిగనున్నారు. అయితే ఈసారి తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే.. చంద్రబాబు కేబినెట్‌లో అచ్చెన్నాయుడికి చోటు దక్కడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అచ్చెన్నాయుడు కూడా మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో ఉన్నారు. ఇటీవల టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా అచ్చెన్నాయుడికి మంత్రి పదవి ఇవ్వడంపై స్పందించారు. శంఖారావం బహిరంగ సభలో మాట్లాడుతూ.. అచ్చెన్న వంటి పవర్ ఫుల్ లీడర్ హోం మంత్రి అయితేనే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే అచ్చెన్నాయుడికి మంత్రి పదవి దక్కడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.

మరోవైపు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీడీపీ హైకమాండ్ మాత్రం ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేదట. ఎంపీగానే పోటీ చేయించాలని అనుకుంటోందట. రామ్మోహన్ నాయుడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించడం ద్వారా ఆ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నీ గెలుచుకోవచ్చని చంద్రబాబు అనుకుంటున్నారట.

అదే సమయంలో రామ్మోహన్ నాయుడిని సంతృప్తి పరిచేందుకు చంద్రబాబు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్దమవుతోంది. అటు బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. కేంద్రంలో మంత్రి పదవి ఇప్పిస్తామని చంద్రబాబు.. రామ్మోహన్ నాయుడికి హామీ ఇచ్చారట. దీంతో రాష్ట్రంలో దక్కకపోయినా.. కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుండడంతో మనసు మార్చుకొని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రామ్మోహన్ నాయుడు సిద్ధమవుతున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 12 =