ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రవీణ్ ప్రకాశ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేస్తూ సోమవారం నాడు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇప్పటివరకు ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న భావనా సక్సేనాను రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ








































