
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆయన అపర చాణుక్యుడని అందరికీ తెలిసిందే. 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకుని చక్రం తిప్పారు. ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు. అప్పటి నుంచి 2004వ సంవత్సరం వరకు 9 సంవత్సరాలు ఏకధాటిగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించారు. విజన్ 2020 పేరుతో భవిష్యత్తు అవసరాలు, సమస్యలను ముందే గుర్తించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి నవశకానికి నాంది పలికారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కూడా రికార్డు సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత పార్టీకి, ఆయనకు తీవ్రమైన కష్టాలు ఎదురయ్యాయి. జైలు జీవితం కూడా అనుభవించారు.
ఈనేపథ్యంలో.. 2024 ఎన్నికలు చంద్రబాబునాయుడుకు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలవకపోతే వ్యక్తిగతంగాను, పార్టీపరంగానూ ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతోంది. దీంతో గెలుపు కోసం చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. అయితే.. విపక్ష పార్టీలోని కొందరు నేతలు ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని పలు కామెంట్లు చేస్తున్నారు. రాజకీయాల్లో ఆయన శకం ముగిసిందని ఎద్దేవా చేస్తున్నారు. అయితే.. వారి విమర్శలను పటాపంచలు చేస్తూ చంద్రబాబు ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కంటే ఎక్కువ సభల్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వయసులో.., నడివేసవిలో లెక్కకు మించి సభలు నిర్వహిస్తూ.. విపక్షాలకు చుక్కలు చూపెడుతున్నారు. ఒక్కోసారి ఏకంగా ఐదు సభల్లో పాల్గొంటున్నారు.
ఈ ఏడాది మార్చి 27వ తేదీన ప్రజాగళం సభ ఏర్పాటుతో.. తన ఎన్నికల ప్రచారాన్ని నారా చంద్రబాబు నాయుడు పలమనేరులో ప్రారంభించారు. ప్రచార గడువు ముగిసే నాటికి.. 90 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు నిర్వహించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. మే 9వ తేదీకే ఆయన 82 సభలు పూర్తి చేసి సంచలనం సృష్టించారు. సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో పోలింగ్ జరుగుతున్నాయి. ఆ క్రమంలో మే 13వ తేదీన నాలుగో దశ పోలింగ్‌లో జరగనుంది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సైతం జరగనుంది. ఈ నేపథ్యంలో మే 11వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎన్నికల ప్రచారపర్వంలో అత్యధిక సభల్లో పాల్గొని చంద్రబాబు వయసులో పెద్ద అయినా, పనితీరులో నవ యువకుడే అన్న గుర్తింపును పొందారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY