ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన అమరావతి రైతుల మహా పాదయాత్ర

Amaravati Farmers Launch Maha Padayatra, Amaravati Farmers Maha Padayatra, Amaravati Farmers Maha Padayatra Enters into Prakasam District, Amaravati Farmers Maha Padayatra Enters into Prakasam District on 6th Day, Amaravati Farmers Padayatra, Amaravati Farmers Padayatra News, Amaravati Farmers Padayatra Update, Amaravati farmers to embark on 45-day Maha Padayatra, Maha Padayatra against three capitals, Mango News, Padayatra against three capitals, Police permit Maha Padayatra against three capitals

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత గ్రామాల రైతులు “న్యాయస్థానం టూ దేవస్థానం” పేరుతో మహా పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. నవంబర్ 1న తుళ్ళూరు గ్రామంలో ప్రారంభమైన రైతుల పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా 45 రోజులపాటుగా సాగుతూ డిసెంబర్ 17న తిరుమలలో ముగియనుంది.

కాగా అమరావతి రైతుల పాదయాత్ర ఆరోరోజున ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. ఆరో రోజు పెదనందిపాడు నుంచి పర్చూరు వరకు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగతుంది. ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన రైతుల పాదయాత్రకు పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రైతులు ఘనంగా స్వాగతం పలికారు. అమరావతి రైతుల పాదయాత్రకు అధికార వైఎస్సార్సీపీ మినహా, టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంతో పాటుగా పలు రాజకీయ పార్టీలు, పలు ప్రజా, రైతు సంఘాలు తమ మద్ధతును ప్రకటించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ