అధికారం చేజిక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో ఘట్టాలు.. ఎన్నో పరిణామాలు.. మరెన్నెంటినో ఎదుర్కొంటే కానీ అధికారం దక్కదు. అధికారం దక్కడం ఒక ఎత్తు అయితే.. దానిని నెలదొక్కుకోవడం మరో ఎత్తు. ఆచూతూచి అడుగులేస్తూ.. అందరి మెప్పు పెంచుకుంటూ పోవాలి. పరిపాలన సజావుగా సాగించాలి. అధికార మత్తులో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారంటే అంతే సంగతి. వారి కొంపకు వారే నిప్పు పెట్టుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు కొందరు నేతలు అటువంటి పరిణామాలనే ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వారు తీసుకున్న నిర్ణయాలే.. గద్దె దిగేలా చేశాయి.
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఒంటరిగా బరిలోకి దిగి 151 స్థానాలను దక్కించుకుంది. 2019-24 వరకు అయిదేళ్లు అధికారంలో ఉంది. కానీ అయిదేళ్లలో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే .. వారి ఓటమికి కారణాలయ్యాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ అవన్నింటిని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డి లెక్క చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో ఫలితాలను చూశాఖ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చేశారు. కానీ అసలు ఎక్కువ వ్యతిరేకత ఉన్న నేతలనే జగన్ వదిలిపెట్టారనే గుసగుసలు వినిపించాయి.
ఇవి పక్కన పెడితే అప్పటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయించడమే వైసీపీ ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు అని అంటున్నారు. అది కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు అరెస్ట్ చేయించి తప్పు చేశారని విశ్లేషకులు అంటున్నారు. అసలు చంద్రబాబు అరెస్ట్ తర్వాతనే వైసీపీకి అసులు కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ లీడర్లకే భద్రత లేకపోతే తమ సంగతేంటి అన్న చర్చ వైసీపీ వ్యతిరేక వర్గాల్లో జరిగి.. వారంతా ఒక్క తాటిపైకి వచ్చేందుకు కారణం అయిందని చెబుతున్నారు. ఈ కారణం చేతనే ఎన్నికల్లో వైసీపీ అతి దారుణంగా ఓడిపోయి.. 11 స్థానాలకే పరిమిత మయిందని విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE