ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు మళ్ళీ మొదలయ్యాయి – చంద్రబాబు

Chandrababu Naidu Comments On YCP Govt,Mango News,Discussion on CM Chandrababu Naidu Comments On YCP Govt,Chandrababu Naidu Emotional Speech And Comments On Ys Jagan,Chandrababu Naidu Latest News,Andhra Pradesh Political News,Ap Political Live Updates

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నాయకులతో గుంటూరులో సమావేశం నిర్వహించారు. ఆ సంధర్బంగా మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కోతలు లేకుండా, అన్ని వర్గాలవారికి అనుగుణంగా అంతరాయం లేకుండా సరఫరా చేశామని, కాని వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఒక నెలలోనే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశామని , ఇప్పుడు రైతులు విత్తనాల కోసం రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. పార్టీ సీనియర్ నాయకులతో, రాష్ట్రము లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, టిడిపి కార్యకర్తల పై దాడులు, ఇతర అంశాలపై చర్చించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here