
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజున, అనంతరం జరిగిర అల్లర్లపై చర్యలు మొదలయ్యాయి. కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. దాడులకు కారకులను అరెస్ట్ చేసేందుకు జల్లెడ పడుతున్నారు. ప్రధానంగా మాచర్లలో జరిగిన విధ్వంసాన్ని సీఈసీ సీరియస్ గా తీసుకుంది. పోలింగ్ రోజున ఏడు ఘటనలు జరిగినట్లు గుర్తించింది. అందులో ఈవీఎం ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేయలేదు.., అధికారులు ఏం చేస్తున్నారు.. అంత అవకాశం ఎలా ఇచ్చారు.., వెంటనే అరెస్ట్ చేయండి.. అంటూ సీఈసీ ఏపీ సీఈఓకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు పోలీసులు రంగంలోకి దిగారు.
పోలింగ్ రోజున కేంద్రంలోకి వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే.. ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిట్ నివేదికతో బయటకు వచ్చిన ఈ వీడియోపై కేంద్రం ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈవీఎంను ధ్వంసం చేయడాన్ని సీరియస్ గా పరిగణించింది. ఆ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా నివేదిక ఇవ్వాలని ఏపీ సీఈఓను ఆదేశించింది. ఈమేరకు సీఈఓకు నోటీసులు జారీ చేసింది. దీంతో అధికారులు ఎమ్మెల్యే అరెస్టుకు రంగంలోకి దిగారు.
పిన్నెల్లి కోసం హైదరాబాద్‌కు ఏపీ పోలీసులు బయలుదేరారు. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారును గుర్తించారు. పిన్నెల్లి కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను గమనించి పిన్నెల్లి మరో కారులో పరారైనట్లు బావిస్తున్నారు. ఎక్కడున్నా పిన్నెల్లి వెంటనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సీరియస్ గా గాలిస్తున్నారు. సీఈసీ ఆగ్రహంపై స్పందించిన ఏపీ సీఈఓ ఎంకే మీనా మాట్లాడుతూ
ఘటన జరిగిన వెంటనే విచారణ ప్రారంభించామని తెలిపారు. వెబ్ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరించామని, ఎమ్మెల్యే పిన్నెల్లిపై సివియర్ గా పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వివరించారు. ఇప్పటికే ఏ1గా కోర్టులో మెమో దాఖలు చేశామన్నారు. ఈవీఎం బద్దలైనా డేటా సురక్షితంగా ఉందని, అందుకే కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామన్నారు. అక్కడ రీపోలింగ్ కు అవకాశం లేదని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY