అభ్యర్ధుల అఫిడవిట్‌లపై జోరుగా సాగుతోన్న చర్చ

AP Rajya Sabha ,election , Rajya Sabha election,affidavits of the candidates,affidavits, Rajya Sabha candidates, Ycp,YCP candidate, Election Commission, TRS, TDP,BJP, AP Elections, Mango News Telugu, Mango News
AP Rajya Sabha ,election , Rajya Sabha election,affidavits of the candidates, ,affidavits, Rajya Sabha candidates, Ycp,YCP candidate

ఏపీలో ఖాళీ అయిన  మూడు స్థానాలకు వైసీపీ తరపున వైవీ సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, మేడా రఘునాథ్‌రెడ్డి  నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి ఎవరూ పోటీలో నిల్చోకపోవడంతో ఈ ముగ్గురి ఎన్నిక  లాంఛనమే కానుంది. రాజ్యసభ రేసులో పోటీ పడటానికి ఒక్కో అభ్యర్థికి 44 ఓట్లు కావాలి. కానీ టీడీపీకి అంత బలం లేకపోవడంతో.. రాజ్యసభ బరిలో అభ్యర్థిని నిలపడానికి ముందుకు రాలేదు. మొత్తంగా చూసుకుంటే.. ఏపీ, తెలంగాణలో రాజ్యసభకు పోటీ లేకుండానే ఈ ముగ్గురూ  ఎన్నికయ్యే అవకాశాలే  కనిపిస్తున్నాయి. ఇటు నామినేషన్ల సందర్భంగా ఈసీకి అఫడివిట్లు సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి ఆస్తుల వివరాలపై జోరుగా చర్చ నడుస్తోంది.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి తోడల్లుడు అయిన వైవీ సుబ్బారెడ్డి సొంతూరు ప్రకాశం జిల్లా మేదరమెట్ల. ఇప్పుడు వైఎస్‌ జగన్‌కు కుడి భుజంగా ఆయనకు పేరుంది. 2014లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆయన.. రెండు సార్లు టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో  పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు.  ఇక వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణికి కలిపి స్థిర, చరాస్తులు మొత్తం రూ.118 కోట్లు అని  అఫిడవిట్‌లో తెలిపారు. అలాగే వైవీ సుబ్బారెడ్డిపై 3 క్రిమినల్‌ కేసులు  ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

రెండో అభ్యర్థి అయిన గొల్ల బాబూరావు..గ్రూప్-1 స్థాయి అధికారి. 2011లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరి.. ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పాయకరావుపేట ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచారు. బాబూరావుకు మొత్తం చరాస్తి విలువ రూ.4.19 కోట్లు. స్థిరాస్తి విలువ రూ.5.75 కోట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు.   రెండు కార్లు, ప్రత్యేకించి ఆయన పేరుతో హోండా స్కూటర్‌ మాత్రమే ఉన్నట్లు  అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు అయిన మేడా రఘునాథ్‌రెడ్డి కూడా రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఆయన పదో తరగతి తర్వాత ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీలో చేరి, మధ్యలోనే ఆపేశారు. వ్యాపారంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న ఆయన రాజకీయాలకు పూర్తిగా కొత్త. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతోనే  రాజ్యసభ ఛాన్స్ దక్కించుకుంటున్నారు. రఘునాథరెడ్డి, ఆయన ఇద్దరు కొడుకులతో కలిపి రూ.475 కోట్ల స్థిర, చరాస్తులున్నట్లు వెల్లడించారు. ఇందులో ఆయన  పేరిటే రూ.385 కోట్ల ఆస్తి ఉంది. అయితే  రఘునాథరెడ్డి పేరు మీద ఒక్క కారు కూడా లేదని అఫడివిట్‌లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY