వైసీపీని కుదిపేస్తున్న ఆ ఎమ్మెల్యే సీటు.. అభ్యర్థి విషయంలో మారిన సీన్

Nellore Politics,MLA seat, YCP,Combined Nellore district, YCP candidate,Magunta Srinivasulu Reddy, Adala Prabhakar Reddy, Vemireddy Prabhakar Reddy, YSRCP, Nellore, kadapa, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
Nellore Politics,MLA seat, YCP,Combined Nellore district, YCP candidate,Magunta Srinivasulu Reddy, Adala Prabhakar Reddy, Vemireddy Prabhakar Reddy

ఉమ్మడి నెల్లూరు జిల్లాను వైఎస్సార్సీపీకి బాగా కలిసొచ్చిన జిల్లాగా చెబుతూ ఉంటారు. కడపతో సమానంగా మొత్తం అన్ని స్థానాల్లోనూ ఇక్కడ ప్రజలు వైసీపీకి విజయాన్ని అందించారు . 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో వైఎస్సార్సీపీ విజయం సాధించగా.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్సీపీ క్లిన్ స్వీప్ చేసేసింది. అయితే ఇప్పుడు అలాంటి ఆ జిల్లాలో ఏకంగా  ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి రెబల్ గా మారడం హాట్ టాపిక్ అయింది.

ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆ స్థానాలతో పాటు మరికొన్ని చోట్ల వైసీపీ మార్పులు చేస్తోంది. నెల్లూరు సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయించడానకి వైసీపీ హైకమాండ్  నిర్ణయం తీసుకుంది.

నెల్లూరు పార్లమెంట్ నుంచి రాజ్యసభ సభ్యులయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈ ఎన్నికలలో పోటీ చేయించడానికి రెడీ అయింది. అయితే వేమిరెడ్డికి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు మధ్య ఇప్పటికే ఉన్న విబేధాలతో వీరిద్దరి పంచాయితీ కొద్ది రోజుల ముందు  సీఎం జగన్ వరకూ వెళ్లింది. అదే సమయంలో కందుకూరుతో పాటు మరి కొన్ని స్థానాలలో అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ వేమిరెడ్డి తన తరపు నుంచి కొన్ని అభ్యంతరాలను సీఎం ముందు ఉంచారట.   దీంతో సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగి ఎంపీ వేమిరెడ్డిని  బుజ్జగించారట. దీంతో అంతా సర్దుకుందని  వైసీపీ శ్రేణులు అనుకున్నారు.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా..ఎన్నికల బరిలోకి దింపడానికి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక ఈ  ఇష్యూ క్లియర్ అయినట్లే అనుకున్నారు. కానీ ఇక్కడ నుంచే మరో  వివాదం మొదలయింది. అనిల్ కుమార్ స్థానంలో మైనారిటీకి అవకాశమిస్తూ నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వడం, పైగా దీనిపై తనకు సమాచారం ఇవ్వకపోవడంతో ఇప్పుడు  వేమిరెడ్డి వైసీపీకి దూరం జరిగినటు వార్తలు వినిపిస్తున్నాయి.  పార్టీ పెద్దలకు ఫోన్ చేసి  తాను పోటీనుంచి వైదొలుగుతున్నట్లు వేమిరెడ్డి   చెప్పేశారట. దీనిపై పార్టీ పెద్దలు బుజ్జగించినా కూడా వేమిరెడ్డి మెత్తబడలేదని తెలుస్తోంది.

సరిగ్గా ఇదే సమయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి టీడీపీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.దీంతో జిల్లాలో ఉన్న పెద్ద రెడ్లంతా వైసీపీని  వీడుతారన్న వార్తలతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు అయిన ఆనం విజయ్ కుమార్ రెడ్డిని సీఎం వైఎస్ జగన్ పిలిపించి మాట్లాడటంతో నెల్లూరు రూరల్ నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డిని పోటీ చేయించనున్నారన్న వార్తలు జోరందుకున్నాయి.

ఇటు తన పార్టీ మార్పుపై వచ్చిన వార్తలను ఖండించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి..తాను వైసీపీ నుంచే బరిలో దిగుతానని తేల్చి చెప్పారు. అంతేకాకుండా తాను వేమిరెడ్డి, మాగుంటలను కలిసి సర్దిచెప్పానని చెప్పిన ఆదాల.. వేమిరెడ్డి విషయంలో మాత్రం తన ప్రయత్నం ఫలించలేదని అన్నారు. ఆదాల తాను పార్టీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చినా.. వేమిరెడ్డి, మాగుంట నిర్ణయం ఏంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 13 =