సోషల్ మీడియాలో పేలుతున్న కామెంట్లు

Jagan Arjuna's astra,social media,YS Jagan,YCP,TDP,MP, MLA, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, Jagan Mohan Reddy Latest Updates, Mango News Telugu, Mango News
Jagan Arjuna's astra,social media,YS Jagan,YCP,TDP,MP, MLA,

ఏపీలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అధికార పార్టీకి, విపక్షాలు మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో  రాజకీయ వాతావరణం హీటెక్కిపోతోంది. తాజాగా అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  టీడీపీపై విరుచుకుపడ్డారు. తనని ఎదుర్కోలేక ఇప్పుడు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని జగన్ ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసంక్షేమం కోసమే పాటుబడినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ప్రతి రూపాయిని ఎంతో బాధ్యతతో, జాగ్రత్తగా ఖర్చుపెడుతూ హ్యూమన్ కాపిటల్ పైన పెట్టుబడిగా పెట్టినట్లు ఏపీ సీఎం చెప్పారు. ఇక గడిచిన ఈ ఐదేళ్లలో ప్రజలకు మాత్రమే చెడుచేసినట్లు, తామసలు మంచే చేయనట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయన్నారు. అలాగే మేనిఫేస్టోలో  ఇచ్చిన వాగ్దానాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయనట్లు ప్రతి పక్ష పార్టీలు నమ్ముుతున్నాయని..అధికార పార్టీని ఎదుర్కోవడం కోసమే ప్రతిపక్ష పార్టీలన్ని ఏకం అవుతున్నాయని విమర్శించారు.

చివరకు జాతీయ పార్టీలతో కూడా ప్రతిపక్షం పొత్తు కలుపుకొంటుందని..ప్రత్యక్షంగా ఒకరితోనూ.. పరోక్షంగా మరొకరితో పొత్తు కలుపుకొని పరువు నిలుపుకోవాలని  చూస్తోందని జగన్ ఆరోపించారు.  ప్రతిపక్షం వెంట  పార్టీలున్నాయని, కొన్ని మీడియా సంస్థలు కూడా ఉన్నాయని చెప్పిన జగన్.. తాను మాత్రం ఒకడినే.. అర్జునుడిలా పోరాడుతున్నానని చెప్పుకొచ్చారు.

ఈ  వీడియోను వైసీపీ సోషల్ మీడియా వింగ్ పోస్ట్ చేయగా.. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.  ప్రతిపక్షానికి మీడియా సంస్థలు అండగా నిలుస్తున్నాయని అంటున్నారు సరే..మరి గౌరవ ముఖ్యమంత్రికి కూడా  సొంత మీడియా ఉందికదా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మాట్లాడితే అర్జునుడితో పోల్చుకోవడం చూస్తుంటే నవ్వొస్తుందని.. మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది ఏపీలో ఈ సారి కూడా జగనే ముఖ్యమంత్రి అంటూ పోస్టులు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =